లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతం నుండి ఒక జంట కదులుతున్న స్కూటీపై వెళ్తూ.. రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో పోలీసులు ఇప్పుడు రోమాంటిక్ కపుల్స్ పై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగవైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని మరిచిపోయింది. నడిరోడ్డుపై ఇద్దరు యువతియువకులు నిస్సిగ్గుగా.. బరితెగించి ప్రవర్తించారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా చేయాల్సిన పనిని స్కూటిపై వెళ్తూ బహిరంగంగా చేస్తూ.. చుట్టుపక్కల వారిని నివ్వెరపోయేలా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి తన ప్రియుడ్ని ముందు నుంచి హాగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించడం చూడవచ్చు. వారిని చూస్తున్న వారిని షాక్ కు గురి చేసింది. సాధారణంగా ప్రేమికులు బైక్ పై వెళ్తూ హత్తుకోవడం లాంటివి అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ ఈ ఘటనలో మాత్రం మరీ అసభ్యకర రీతిలో వారి ప్రవర్తిన ఉంది.
undefined
ఓ యువకుడు తన స్కూటీ నడుపుతుండగా అతనికి వ్యతిరేక దిశలో యువతి అసభ్యకరంగా కూర్చుంది. ఆమె కాళ్లను అతని నడుముకు, చేతులను మెడకు పెనవేసుకుని కూర్చుంది. అంతటితో ఆగకుండా.. ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఈ ఘటనను చూసి షాక్ అయినా వాహనదారులు.. నడిరోడ్డుపై ప్రేమ జంట బరితెగించిన తీరును వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ఆ దృశ్యాలను పరిశీలించడం ప్రారంభించారు. లక్నో సెంట్రల్ జోన్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో లక్నోకు చెందినదని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో తీసినదని ధృవీకరించారు. ఆ ప్రేమికుల జంట కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వారిని పట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అశ్లీలత ప్రచారం చేసిన దంపతులపై మోటారు వాహన చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
चलती स्कूटी में बीच सड़क इश्क़ का खुल्लम खु्ल्ला इज़हार।
- वीडियो लखनऊ हज़रतगंज का बताया जा रहा है। pic.twitter.com/65aLWkMPdd