అగ్ని ప్రైమ్ ప్రయోగం విజయవంతం

By narsimha lodeFirst Published Jun 28, 2021, 3:12 PM IST
Highlights

అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని సోమవారం నాడు భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో  ఈ క్షిపణిని పరీక్షించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000-1500 కి.మీ. దూరంలో ఉన్న  లక్ష్యాలను సునాయాసంగా చేధించగలదు

న్యూఢిల్లీ: అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని సోమవారం నాడు భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో  ఈ క్షిపణిని పరీక్షించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000-1500 కి.మీ. దూరంలో ఉన్న  లక్ష్యాలను సునాయాసంగా చేధించగలదు.

వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్ధ్యం  ఈ క్షిపణికి ఉంది. రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని-1 కంటే తేలికగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.4 వేల కి.మీ. రేంజ్ కలిగిన అగ్ని4, 5 వేల కి.మీ. రేంజ్ గల అగ్ని 5 ఫీచర్లను సైతం అగ్ని ప్రైమ్ లో మిళితం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి డీఆర్‌డీఓ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. 

భువనేశ్వర్ కు తూర్పున 150 కి.మీ. దూరంలో జరిగిందని డీఆర్‌డీఓ ప్రకటించాయి. తూర్పు తీరం వెంబడి టెలిమెట్రీ , రాడార్ స్టేషన్లు  ట్రాక్ చేసి క్షిపణి తీరును పర్యవేక్షించినట్టుగా డీఆర్‌డీఓ తెలిపింది.  రెండు రోజుల క్రితం ఒడిశాలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్ నుండి దేశీయంగా అభివృద్ది చెందిన పినాకా రాకెట్ విస్తరించిన శ్రేణి వెర్షన్ ను కూడ డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది.మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుండి ప్రయోగించిన మొత్తం 25 మెరుగైన పినాకా రాకెట్లు వేర్వేరు శ్రేణుల లక్ష్యాలను త్వరిగతిన చేరుకొన్నాయని డీఆర్‌డీఓ తెలిపింది.


 

click me!