కూతురు ముందే అతని తల నరికారు: తలను కారులో వేసుకుని వెళ్లారు

Published : Apr 28, 2020, 03:23 PM IST
కూతురు ముందే అతని తల నరికారు: తలను కారులో వేసుకుని వెళ్లారు

సారాంశం

శ్రీరంగంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ముఠా సభ్యులు ముగ్గురు రౌడీ షీటర్ తల నరికారు. కూతురు ముందే ఆ పనిచేసి తలను తీసుకుని వెళ్లి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.

శ్రీరంగం: ఓ ముగ్గురు వ్యక్తుల ముఠా పేరుమోసిన రౌడీని హత్య చేశారు. ఈ సంఘటన శ్రీరంగంలో చోటు చేసుకుంది. అతని కూతురు ముందే వారు అతని తల నరికారు. ఆ తలను తీసుకుని వెళ్లి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఈ సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది. 

హతుడిని శ్రీరంగంలోని డ్రైనేజీ స్ట్రీట్ కు చెందిన 38 ఏళ్ల చంద్రమోహన్ అలియాస్ తలైవెట్టి చంద్రుగా గుర్తించారు. అతను పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతనిపై చాలా కేసులున్నాయి.. 

కూతురితో టూవీలర్ పై వెళ్తున్న చంద్రమోహన్ ను కారులో వచ్చిన ముఠా సభ్యులు దేవీ థియేటర్ వద్ద అడ్డగించారు. కారు నుంచి దిగి ముఠా సభ్యులు చంద్రుపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అతని కూతురిని వదిలేశారు. 

ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తలను తీసుకుని వెళ్లి వారు పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?