లాక్‌డౌన్ ఎఫెక్ట్ :' 55 ఏళ్లు దాటిన పోలీసులు ఇళ్లలోనే ఉండొచ్చు'

Published : Apr 28, 2020, 02:21 PM IST
లాక్‌డౌన్ ఎఫెక్ట్ :' 55 ఏళ్లు దాటిన  పోలీసులు ఇళ్లలోనే ఉండొచ్చు'

సారాంశం

 55 ఏళ్లు దాటిన పోలీసులు ఎవరూ కూడ రెండో దశ లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇంటి వద్దనే ఉండాలని ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆదేశించారు.ఈ మేరకు ఆయన ముంబైలోని 94 పోలీస్ స్టేషన్లకు నోట్ పంపారు. రెండో దశ లాక్ డౌన్ మే 3వ తేదీ వరకే ఉంది.  

ముంబై: 55 ఏళ్లు దాటిన పోలీసులు ఎవరూ కూడ రెండో దశ లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇంటి వద్దనే ఉండాలని ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆదేశించారు.ఈ మేరకు ఆయన ముంబైలోని 94 పోలీస్ స్టేషన్లకు నోట్ పంపారు. రెండో దశ లాక్ డౌన్ మే 3వ తేదీ వరకే ఉంది.

కరోనా వైరస్ కారణంగా ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మరో 55 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు.  50 ఏళ్లు పై బడినవారితో పాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్,, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సెలవుపై వెళ్లవచ్చని ముంబై పోలీస్ కమిషనర్ ప్రకటించారు.మే 3వ తేదీ వరకు 50 ఏళ్లు దాటిన వారంతా విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని ముంబై కమిషనర్ తేల్చి చెప్పారు.

also read:ఏడు రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

55 ఏళ్లకు పై బడిన వారు విధులు నిర్వహించేందుకు వస్తే వారికి క్షేత్ర స్థాయిలో విధులు కేటాయించవద్దని కమిషనర్ సూచించారు. ఫీల్డ్ లో విధులు నిర్వహిస్తే కరోనా వైరస్ బారినపడే అవకాశం ఉందని ముంబై కమిషనర్ చెప్పారు.మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 8,590కి చేరుకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?