ఏడు రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

By narsimha lode  |  First Published Apr 28, 2020, 1:41 PM IST

ఏడు రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హార్షవర్ధన్ ప్రకటించారు.మంగళవారం నాడు ఆయన అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.


న్యూఢిల్లీ: ఏడు రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హార్షవర్ధన్ ప్రకటించారు.మంగళవారం నాడు ఆయన అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

 గత 14 రోజులుగా 47 జిల్లాల్లో ఒక్క కేసు కూడ నమోదు కాలేదన్నారు.21 రోజులుగా 39 జిల్లాల్లో ఒక్క కేసు కూడ  రిపోర్టు కాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 28 రోజులుగా 17 జిల్లాల్లో కూడ ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదన్నారు.

Latest Videos

కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యే సంఖ్య కూడ తగ్గిందన్నారు. గత 14 రోజులుగా కరోనా వైరస్ కేసులు రెట్టింపు కావడం 8.7గా ఉందన్నారు.అయితే వారం క్రితం నుండి 10.2 రోజులకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.గత మూడు రోజుల నుండి కరోనా కేసులు రెట్టింపు కావడం 10.9 రోజులకు చేరుకొందన్నారు. 

ఢిల్లీలోని కరోనా వైరస్ కేసుల గురించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌తో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గత 24 గంటల్లో 1,543 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,435కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

also read:మే 3 తర్వాత హాట్ స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగింపు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

21,632 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది. 6,868 మంది కరోనా కేసుల నుండి కోలుకొని ఇంటికి చేరుకొన్నారని కేంద్రం తెలిపింది.గత 24 గంటల్లో 62 మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ ప్రకటించింది.దీంతో ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య దేశంలో 934కి చేరింది.

మహారాష్ట్రలో  ఇవాళ్టికి కరోనా కేసుల సంఖ్య8590కి చేరుకొన్నాయి. వీరిలో 1,282 మంది కోలుకొన్నారు. 369 మంది చనిపోయారు.గుజరాత్ రాష్ట్రంలో 3548 కేసులు నమోదయ్యాయి. వీరిలో 394 మంది కోలుకొన్నారు. 162 మంది మృతి చెందారు.ఢిల్లీలో 3,108 కేసులు నమోదు కాగా, 877 మంది కోలుకొన్నారు. మరో 54 మంది చనిపోయారు. 

click me!