రౌడీ కపుల్.. డ్రైవర్ తో మాటలు కలిపి, మద్యం తాగించి.. కారుతో పరార్..

By SumaBala BukkaFirst Published Sep 27, 2022, 8:36 AM IST
Highlights

కారు డ్రైవర్ తో మాటలు కలిపి.. పార్టీ చేసుకుందామని మద్యం తాగించిన ఓ జంట.. డ్రైవర్ ను కారులోంచి తోసేసి.. కారుతో పరారయ్యారు. 
 

బెంగళూరు : కారు డ్రైవర్ కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్ జ్యోతి (25)ని యలాహంక ఉప నగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్ శెట్టి తెలిపిన వివరాల మేరకు.. వీరు ఇటీవల రాత్రి 10:30 గంటల సమయంలో నాగేనహళ్లి గేట్ దగ్గర ఓలా కార్ బుక్ చేసుకుని నగరంలోని వివిధ ప్రదేశాలు తిరిగారు. డ్రైవర్ శివశంకర్ తో మంచిగా మాట్లాడుతూ డాబాలో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లారు. అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. 

మత్తులో డ్రైవర్ కారులో పడుకుని ఉండగా మంజా తాళాలు తీసుకుని.. నడుచుకుంటూ వెళ్లి.. రాజనుకుంటె దగ్గర డ్రైవర్ను బయటకు తోసి.. అతని మొబైల్ తీసుకుని ఉడాయించ్చారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు జరిపి ఘరానా జంటను అరెస్టు చేసి, కారు, రెండు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి.

రాజస్థాన్ లో హీటెక్కిన‌ పొలిటిక‌ల్ వార్ .. కూల్ గా పుట్ బాల్ ఆడుతున్న రాహుల్

ఇదిలా ఉండగా,  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఇలాంటి జంటనే సెప్టెంబర్ 4న అరెస్టయ్యారు. వరుస దొంగతనాలకు పాల్పడిన భార్యాభర్తలను పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 37.8 తులాల బంగారం, 32 తులాల వెండితో పాటు 11వేల 500 నగదు రికవరీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన  తాళ్ళపల్లి ధనలక్ష్మి, ప్రసాద్ లు గతంలో వేములవాడ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసుల పరిశీలనలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన ధనలక్ష్మి, ప్రసాద్ లను గుర్తించి వారిని ఆరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ . . . వేములవాడ పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా సిసి టీవి కెమెరాలను పరిశీలించామని.. అందులో నిందితులను బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యా,భర్తలు ధనలక్ష్మి, ప్రసాద్ లుగా గుర్తించామని, వారిని బెల్లంపల్లిలో ఆరెస్ట్ చేశామన్నారు. వారిని విచారించగా, ఈ ప్రాంతంలో పలు దొంగతనాలు కూడా చేసినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ధనలక్ష్మి ఇటీవల జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని ఆయన  వివరించారు. 

తాజ్‌మహల్‌కు స‌మీపంలో ఆ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి: సుప్రీంకోర్టు ఆదేశం

వీరి వద్దనుండి  37.8 తులాల బంగారం, 32 తులాల వెండితో పాటు 11 వేల 500  నగదు రికవరీ చేసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజలేవ్వరు కూడా అధిక మొత్తంలో డబ్బులను ఇంట్లో ఉంచుకోకూడదని ఆయన సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలో గల పోలీస్ స్టేషనుకు సమాచారం అందించాలని, ప్రజలు కూడా ప్రతి వాడలో సిసి కెమెరాలను అమర్చుకున్నట్లైతే దొంగతనాలకు ఆస్కారం ఉండదని ఆయన సూచించారు.

click me!