కేంద్రమంత్రి సోనోవాల్ ఇంట్లో రొంగలీ బిహు వేడుకలు.. సంగీతకారుడిగా మారిన మోడీ (వీడియో)

Siva Kodati |  
Published : Apr 23, 2022, 09:53 PM ISTUpdated : Apr 23, 2022, 09:57 PM IST
కేంద్రమంత్రి సోనోవాల్ ఇంట్లో రొంగలీ బిహు వేడుకలు.. సంగీతకారుడిగా మారిన మోడీ (వీడియో)

సారాంశం

ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడున్నా తన ప్రత్యేకతను చాటుకుంటారు. ముందు నలుగురితో కలిసిపోవడమే ఆయనకు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నివాసంలో జరిగిన రొంగలీ బిహు వేడుకల్లో మోడీ పాల్గొని సంగీత వాయిద్యాలు వాయించేందుకు ప్రయత్నించారు.   

దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) నివాసంలో రొంగలీ బిహు (Rongali Bihu) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంగీత వాయిద్యాలను వాయించేందుకు ప్రయత్నించారు. అలాగే అస్సాంకు చెందిన కళాకారులు ప్రదర్శించిన బిహు డ్యాన్స్, జానపద నృత్య కలయిక, ఇతర కార్యక్రమాలను ప్రధాని గంటకు పైగా ఆసక్తిగా వీక్షించారు. అంతేకాదు కళాకారులు, ఇతర అతిథులతోనూ ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రధాని మోడీని సోనోవాల్ అభినందించారు. ఇది అస్సామీ ప్రజలపై వారి సంస్కృతిపై ప్రధానికి  వున్న ప్రేమను తెలియజేస్తోందని సోనోవాల్ అన్నారు. 

బిహు, రొంగలీ బిహు, బోహాగ్ బిహు అని కూడా ఈ పర్వదినాన్ని పిలుస్తారు. ఇది అస్సామీలకు నూతన సంవత్సరాది. అంతకుముందు ఏప్రిల్ 14న ప్రధాని మోడీ బిహు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ ఈ ప్రత్యేక పండుగ శక్తివంతమైన అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ బిహు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా’’ నని ప్రధాని ట్వీట్ చేశారు. 

అంతకుముందు గురువారం ఎర్రకోట వద్ద జరిగిన కార్యక్రమంలో  ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశం ఏ దేశానికి లేదా సమాజానికి ఎప్పుడూ ముప్పు కలిగించలేదు. నేటికీ మనం సర్వలోక కళ్యాణం కోసమే ఆలోచిస్తామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ వివాదాల మధ్య నేటికీ మొత్తం ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని, సిక్కు గురువుల ఆదర్శాలను దేశం అనుసరిస్తోందని ప్రధాని అన్నారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు.

ప్రపంచ చరిత్రలో మతం, మానవ విలువలు, ఆదర్శాలు, సూత్రాలను రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన తొమ్మిదవ సిక్కు గురువు బోధనలను ప్ర‌స్త‌వించారు.  గురు తేజ్ బహదూర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 24న ‘షాహీదీ దివస్’గా జరుపుకుంటారు. అతను శిరచ్ఛేదం చేసిన ప్రదేశంలో నిర్మించిన గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ , ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ అతని త్యాగానికి సంబంధించినవి. అతని వారసత్వం దేశానికి గొప్ప ఏకీకరణ శక్తిగా పనిచేస్తుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ