మహిళా ఎస్‌ఐపై కత్తితో దాడి చేసిన దుండగుడు.. చికిత్స పొందుతున్న ఎస్‌ఐని ఫోన్‌లో పరామర్శించిన సీఎం..

Published : Apr 23, 2022, 06:02 PM ISTUpdated : Apr 23, 2022, 06:05 PM IST
మహిళా ఎస్‌ఐపై కత్తితో దాడి చేసిన దుండగుడు.. చికిత్స పొందుతున్న ఎస్‌ఐని ఫోన్‌లో పరామర్శించిన సీఎం..

సారాంశం

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో షాకింగ్​ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో షాకింగ్​ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సుత్తమల్లి పోలీస్ స్టేషన్‌లో 29 ఏళ్ల మార్గరెట్ థెరిసా విధులు నిర్వర్తిస్తోంది. జిల్లాలోని పళవూర్​ గ్రామంలోని ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. Pazhavoorలోని ఆలయ ఉత్సవాల్లో థెరిసా విధులు నిర్వరిస్తున్నారు. అయితే అక్కడ 40 ఏళ్ల అరుముగమ్ గొడవ సృష్టించాడు. దీంతో థెరిసా.. గొడవ ఆపాలని అతడిని హెచ్చరించింది.

అయితే గతంలో ఆరుముగమ్ మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేసినందుకు థెరిసా అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కోపాన్ని మనసులో పెట్టుకున్న అరుముగమ్.. ఇదే అదనుగా థెరిసాపై కత్తితో దాడి చేశాడు. దీంతో థెరిసాతో విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అరుముగమ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన థెరిసాను తిరునల్వేలి మెడికల్ కాలేజ్‌కు తరలించారు. 

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ పి శరవణన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే తిరునల్వేలి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న థెరిసాను పరామర్శించారు. మరోవైపు తనను డ్రంక్​​ అండ్​ డ్రైవ్​ కేసులో అరెస్ట్​ చేసి ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారనే కోపంతోనే మార్గరెట్​ థెరిసాపై కత్తితో దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 

ఇక, ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. గాయపడిన థెరిసాను ఫోన్‌లో స్టాలిన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకన్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. థెరిసాకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !