రైలులో కాల్పుల కలకలం.. బెదిరించి దారి దోపిడి..

By Rajesh Karampoori  |  First Published Sep 25, 2023, 6:51 AM IST

జార్ఖండ్‌లో రైలులో దోపిడి జరిగింది. లతేహార్ రైల్వేలో కొంత మంది దుండగులు తుపాకులు చూపించి భయాందోళనకు గురి చేశారు.  ఆ తర్వాత వారి వద్ద నుంచి నగదు, నగలు లాక్కున్నారు. అనంతరం.. ట్రైన్ చైన్ లాగి    ఆ ముఠా పారిపోయింది.


కదులుతున్న రైలులో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. తుపాకుల చూపిస్తూ.. ప్రయాణికులను బెదిరింపులకు గురి చేసి.. లక్షల రూపాయల నగదు, విలువైన వస్తువులను, ఆభరణాలను దోచుకున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దాల్తోన్‌గంజ్ స్టేషన్‌లో హంగామా సృష్టించారు.

వివరాల్లోకెళ్తే.. సంబల్‌పూర్ నుంచి జమ్ముతావి వెళ్తున్న జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి బర్వాదిహ్- లతేహర్ స్టేషన్ల మధ్య జరిగింది. రైలు ప్రయాణికుల నుంచి లక్షల రూపాయలు దోచుకున్నారు నేరగాళ్లు. దోపిడీ సమయంలో పలువురు ప్రయాణికులు  కొట్టబడ్డారు. ఈ ఘర్షణలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సంబల్‌పూర్-జమ్ముత్వీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో నేరస్థులు ఈ ఘటనకు పాల్పడ్డారు. 

Latest Videos

దోపిడీ అనంతరం నేరస్తులు పారిపోయారు. రైలు దాల్తోన్‌గంజ్ స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణికులు బీభత్సం సృష్టించారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు రైలు దాల్తోగంజ్‌లో నిలిచిపోయింది. తరువాత.. గాయపడిన ప్రయాణీకులకు డాల్టన్‌గంజ్ స్టేషన్‌లోనే ప్రథమ చికిత్స అందించారు, ఆ తర్వాత రైలు ముందుకు సాగింది. దోపిడీ సమయంలో నేరస్థులు ఎనిమిది నుంచి పది రౌండ్లు కూడా కాల్చారు. స్లీపర్ బోగీ ఎస్9 నుంచి రెండు షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రయాణికులు మాట్లాడుతూ.. లతేహర్ స్టేషన్ నుంచి జమ్మూ తావీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన తర్వాత కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. రైలు ఎక్కిన దాదాపు అరడజను మంది నేరగాళ్లు దోపిడీకి దిగారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు నేరస్తులు దోపిడీ కొనసాగించారు. బర్వాదీ స్టేషన్ దగ్గర రైలు ఆగగానే నేరస్తులంతా కిందకు దిగి పారిపోయారు. దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కొంతమంది ప్రయాణికులను నేరస్థులు తీవ్రంగా కొట్టారు.

బర్వాడీ నుంచి బయలుదేరిన రైలు దాల్తోగంజ్ స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణికులు బీభత్సం సృష్టించారు. అనంతరం గాయపడిన వారందరికీ ప్రథమ చికిత్స అందించారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రయాణికులు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రైలు మరింత ముందుకు సాగింది.

click me!