క్వారంటైన్ కేంద్రంలో చోరీ: టెస్టులు కోసం బయటకి వెళితే.. 3.5 లక్షలు దోచేశారు

Siva Kodati |  
Published : Sep 11, 2020, 02:52 PM IST
క్వారంటైన్ కేంద్రంలో చోరీ: టెస్టులు కోసం బయటకి వెళితే.. 3.5 లక్షలు దోచేశారు

సారాంశం

క్వారంటైన్ సెంటర్‌లలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా క్వారంటైన్ సెంటర్‌లో ఓ మహిళకు చెందిన రూ.3.5 లక్షల సొమ్మును దొంగలు దోచుకున్నారు

క్వారంటైన్ సెంటర్‌లలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా క్వారంటైన్ సెంటర్‌లో ఓ మహిళకు చెందిన రూ.3.5 లక్షల సొమ్మును దొంగలు దోచుకున్నారు.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోంబివాలాకు చెందిన 34 ఏళ్ల మహిళకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో పిల్లలతో కలిసి క్వారంటన్ కేంద్రంలో జాయిన్ అయ్యింది.

అక్కడ పరీక్షల నిమిత్తం తాను బస చేస్తున్న గది నుంచి పిల్లలతో కలిసి మరో చోటికి వెళ్లింది. టెస్టులు పూర్తి చేసుకుని తిరిగి తన గదికి వచ్చి చూస్తే.. మంగళసూత్రం, రెండు చైన్‌లు, నాలుగు వేల రూపాయల నగదు కనిపించలేదు.

దీంతో ఆమె క్వారంటైన్ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!