ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి: 28 ఏళ్ల వ్యక్తి చేయి నరికివేత

By narsimha lodeFirst Published Sep 11, 2020, 1:41 PM IST
Highlights

28 ఏళ్ల వ్యక్తిపై కిడ్నాప్ తోపాటు ఏడేళ్ల చిన్నారిపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కేసులు నమోదయ్యాయి.  ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని పానీపట్టులో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీ: 28 ఏళ్ల వ్యక్తిపై కిడ్నాప్ తోపాటు ఏడేళ్ల చిన్నారిపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కేసులు నమోదయ్యాయి.  ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని పానీపట్టులో చోటు చేసుకొంది.

బాలుడిని రక్షించే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చేతిని నరికారని అతని సోదరుడు ఆరోపిస్తున్నాడు. తన సోదరుడిపై కొందరు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు.

ఈ ఘటనపై రెండు ఎప్ఐఆర్ లు నమోదయ్యాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఐఖ్లాక్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.చేయి నరికివేతకు గురైన బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.  మరో వర్గానికి చెందిన అని తెలుసుకొని తన సోదరుడి చేయిని నరికారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఏడాది ఆగష్టు 23, 24 తేదీ రాత్రి తన  కుటుంబంతో ఏడేళ్ల చిన్నారి నిద్రిస్తున్న సమయంలో 28 ఏళ్ల యువకుడు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ బాలుడి ఇళ్లు రైల్వే లైన్ కు సమీపంలో ఉంది.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు బాలుడిని రక్షించారు.  28 ఏళ్ల యువకుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే అతను తప్పించుకొన్నట్టుగా బాలుడి కుటుంబసభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.

ఆగష్టు 24 వ తేదీన రైల్వే పోలీసులు ఐఖ్లాక్ ను  రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తించారు. అతని చేయి నరికివేయబడి ఉంది.అతను ఉద్యోగం కోసం వెతుక్కొంటూ పానీపట్ చేరుకొన్నాడు. వేరే వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన తర్వాత అతని చేయిని నరికివేసినట్టుగా బాధితుడి సోదరుడు ఆరోపించారు.

ఇరు వర్గాల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. రెండు కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.ఉత్తర్ ప్రదేశ్ నుండి  పానీపట్ కు ఐఖ్లాక్ తిరిగి వచ్చాడు. ఉపాధి కోసం యూపీకి వెళ్లి పానీపట్టుకు వచ్చినట్టుగా ఆయన సోదరుడు గుర్తు చేశాడు. అయితే అతనికి బస చేసేందుకు స్థలం లేదు. 

పార్క్ లోని బెంచీ మీద కూర్చొన్నాడు.  ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని పేరు అడిగి చితకబాదారని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. ఆ తర్వాత తన సోదరుడు  సమీపంలోని ఇంటికి వెళ్లిన తర్వాత అతనిని లోపలికి లాగి  చేయిని నరికారని ఆయన ఆరోపించారు. దీంతో తన సోదరుడు రైల్వే ట్రాక్ పక్కన స్పృహ కోల్పియినట్టుగా ఆయన వివరించారు.
 

click me!