బిర్యాని అమ్ముతూ కోట్ల సంపాదన.. బెంగుళూరు యువతి రమ్యరవి సక్సెస్ స్టోరీ..!

By Mahesh Rajamoni  |  First Published Aug 19, 2023, 3:40 PM IST

బిర్యానిని ఇష్టపడని వారుండరు. అయితే ఆ ఇష్టమే ఒక యువతి వ్యాపారాన్ని ప్రారంభించేలా చేసింది. అవును అమ్మమ్మ చేసే టేస్టీ టేస్టీ డోనే బిర్యాని తింటూ పెరిగిన ఓ బెంగుళూరు యువతి  అదే బిర్యాని వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యింది. ఇంతకీ ఆ యువతి స్టోరీ ఏంటంటే? 


గొప్ప గొప్ప చదువులు చదివి కొందరు మంచి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్ చేయాలనుకుంటారు. ఇంకొంత మంది సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తుంటారు. ఇక వ్యాపారంలో లాభాలు రావాలంటే కాస్త ఓపిక అవసరం. ఇది లేనివారే వ్యాపారంలోచి తొందరగా వెళ్లిపోతారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఓ యువతి బిర్యాని అమ్ముతూ ఏకంగా కోట్లను సంపాదిస్తోంది. ఆమె పేరు రమ్య రవి. 

రమ్యరవి తన అమ్మమ్మ వండిన డోనే బిర్యానీ తింటూ పెరిగింది. కర్ణాటక స్టైల్ బిర్యానీ లక్నో, హైదరాబాద్ వేరియంట్స్ అంత ఫేమస్ కాదు. దీనివల్లే ఆమె బిర్యానీ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ టేస్ట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. కరోనా వైరస్ మహమ్మారి మధ్యలోనే ఈమె తన వ్యాపారాన్ని ప్రారంభించింది. కాగా ఆమె తన వ్యాపారంలో అతి తక్కువ కాలంలోనే మంచి విజయాన్ని సాధించింది.

Latest Videos

రమ్య రవి 2020లో రూ.5 లక్షల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆమె వ్యాపార టర్నోవర్ రూ.10 కోట్లుకు చేరింది. ఈ సంస్థ ప్రధానంగా బెంగళూరులో మంచి ఫేమస్ అయ్యింది. అయితే ఆమె కుటుంబానికి అప్పటికే ఎన్నో హోటళ్లు ఉన్నాయి. కానీ వాటిపై ఆధారపడకుండా ఆమె సొంతంగా బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకుంది.

రమ్యరవి పుట్టింది బెంగళూరులో. ఆమెకు శ్వేత, రవీనా అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఈమె వ్యాలీ స్కూల్లో చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో బీకాం చేశారు.ఈమె తన వ్యాపార చతురతను మెరుగుపర్చుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ లో స్వల్పకాలిక కోర్సు కూడా చేసిందట. ఆమె తన తండ్రి పనిని చూసి నేర్చుకుంది. ఆమె తన తండ్రి ఆర్ రవిచందర్ తో కలిసి కొన్ని రోజులు పనిచేశారు.

అయితే ఆమె సొంతంగా ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంది. ఆర్ఎన్ఆర్ బిర్యానీ పేరుతో ఓ కంపెనీని స్టార్ట్ చేసింది. దీనికి తన తండ్రి, తాతయ్య పేరు పెట్టారు. అయితే బెంగళూరులోని నాగరాబావిలో 200 చదరపు అడుగుల స్థలం మాత్రమే ఉండేది. వాళ్లకు ఒకే వంటమనిషి ఉండేవారు. అయినా వీరి వ్యాపారం విజయవంతమైంది. ఫస్ట్ మంత్ లోనే వీళ్లు 10000  డెలివరీలు చేశారు. డిమాండ్ పెరగడంతో కిచెన్ ను పెంచుతూ వచ్చారు. 2021 చివర్లో బెంగళూరులోని జయనగర్ లో మరో రెస్టారెంట్ ను ప్రారంభించారు. వీరు ఆహారాన్ని టిన్ బాక్సుల్లో వడ్డిస్తారు. ఇది జనాలను ఎక్కువగా వచ్చేలా చేసింది. ప్రస్తుతం వీరి బిజినెస్ మంచి లాభాల్లో దూసుకుపోతోంది.
 

click me!