అన్నింటికి కారణం అవేనట: అందుకని ఎలుకలతో అసెంబ్లీకి

Siva Kodati |  
Published : Mar 06, 2020, 07:20 PM IST
అన్నింటికి కారణం అవేనట: అందుకని ఎలుకలతో అసెంబ్లీకి

సారాంశం

బీహార్‌‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిరసన తెలియజేసేందుకు ఆర్జేడీ విభిన్నంగా ప్రయత్నించింది. శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఎలుకను బోనులో పెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి. వరి కంకులు, ఖాళీ కుండలు, లాంతర్లు ఇలా ఎలా కుదిరితే అలా. ఇదే సమయంలో బీహార్‌‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిరసన తెలియజేసేందుకు ఆర్జేడీ విభిన్నంగా ప్రయత్నించింది.

శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఎలుకను బోనులో పెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దీనిపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ మాట్లాడుతూ.. ప్రభుత్వం కీలక పత్రాలను మాయం చేస్తోందని, వాటిపై ప్రశ్నిస్తే ఎలుకలను సాకుగా చెబుతోందని ఆమె మండిపడ్డారు.

అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడిసిన్, లిక్కర్ మాఫియా అరాచకాలు సృష్టిస్తోందని దీనికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని రబ్రీ దేవీ ఆరోపించారు. అందుకే తాము ఎలుకలతో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలియజేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. 

Also Read:

రచ్చకెక్కిన నితీష్ - పీకే ల వ్యవహారం: ఇంతకీ ప్రశాంత్ కిషోర్ కి ఎం కావాలి?

బాత్ బీహార్ కీ: నితీష్ కుమార్ పై యుద్ధం ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?