ఆడవాళ్లను అడ్డంగా నరికేయాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Oct 12, 2018, 04:35 PM IST
ఆడవాళ్లను అడ్డంగా నరికేయాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

మహిళలను రెండు భాగాలుగా తెగనరికి ఓ భాగాన్ని ఢిల్లీకి పంపి, రెండో భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్శిల్ చేయాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. 

ఆడవాళ్లను అడ్డంగా నరికివేయాలంటూ మళయాళం సినీ నటుడు కొల్లాం తులసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలసిందే.

కాగా.. సుప్రీం ఇచ్చిన తీర్పును  చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరు మహిళలు కూడా సుప్రీం తీర్పును తప్పుబట్టారు. సుప్రీం ఆడవారిని శబరిమల ఆలయం ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. తమకు 50ఏళ్లు నిండిన తర్వాతే స్వామిని దర్శించుకుంటామని కొందరు మహిళలు చెబుతున్నారు.

అయితే.. ఈ విషయంలో మళయాళం నటుడు కొల్లాం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల సందర్శనకు వచ్చే మహిళలను అడ్డంగా నరికేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళలను రెండు భాగాలుగా తెగనరికి ఓ భాగాన్ని ఢిల్లీకి పంపి, రెండో భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్శిల్ చేయాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. తులసి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు