ఆపిల్ ఎగ్జిక్యూటివ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

By Nagaraju TFirst Published Oct 12, 2018, 4:20 PM IST
Highlights

 ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ హత్య ఘటనలో బాధితులను ఆదకునేందుకు యూపీ సర్కార్ దిగొచ్చింది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కుటుంబాన్ని పరామర్శించిన యూపీసీఏం యోగి ఆదిత్యనాథ్ వారి కటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పిల్లలతోపాటు ఆపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ తివారి తల్లికి కూడా నష్టపరిహారం ఇస్తున్నట్లు ప్రటకించారు. 
 

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ హత్య ఘటనలో బాధితులను ఆదకునేందుకు యూపీ సర్కార్ దిగొచ్చింది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కుటుంబాన్ని పరామర్శించిన యూపీసీఏం యోగి ఆదిత్యనాథ్ వారి కటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పిల్లలతోపాటు ఆపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ తివారి తల్లికి కూడా నష్టపరిహారం ఇస్తున్నట్లు ప్రటకించారు. 

అయితే మనోజ్ తివారీ హత్యపై భార్య కల్పన పోలీసుల తీరుపైనా, యూపీ ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులే అన్యాయంగా చంపేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. నా భర్తను చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

తనభర్త హత్య కేసును సీబీఐకు అప్పగించాలని అలాగే తనకు పోలీస్ శాఖలో ఉద్యోగంతోపాటు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు వివేక్ తివారీ హత్యపై ప్రతిపక్ష పార్టీలు సైతం పెద్ద ఎత్తను ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయంగా దుమారం రేగుతుండటంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కల్పనను పరామర్శించారు. ఆర్థికసహాయం కూడా అందజేశారు. 

ఆ సమయంలో వివేక్ తివారీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా కల్పన తివారికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ను ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ కల్పనకు అందజేశారు. కల్పన నివాసానికి వెళ్లి ఆమెను కుటుంబ సభ్యులను పరామర్శించిన దినేష్ శర్మ నగర్‌ నిగమ్‌లో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను అందజేశారు. 

తన భర్త హత్యాయత్నం కేసు విచారణ సంతృప్తికరంగా ఉందని తివారీ భార్య కల్పన స్పష్టం చేశారు. హత్య కేసులో ప్రభుత్వం చూపుతున్న చొరవపై సంతృప్తి చెందినట్లు ప్రకటించారు. 

లక్నోలోని మక్దుంపూర్ పీఎస్ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పోలీసు తనిఖీలలో భాగంగా జరిపిన కాల్పుల్లో ఆపిల్ ఉద్యోగి వివేక్ తివారీ చనిపోయాడు. స్నేహితురాలు సనా ఖాన్‌తో వెళ్తున్న వివేక్‌ను కారు ఆపాలని పోలీసులు సూచించగా వినకుండా వేగంగా వెళ్లడంతో కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరి కాల్పులు జరపగా అతడి మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. 

ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది క్షణాల్లోనే వివేక్ తివారి చనిపోయాడు. పోలీసు కానిస్టేబుల్‌పై హత్య కేసును నమోదు చేశారు. కాల్పులు జరిపిన ప్రశాంత్ చౌదరిని, ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్‌ సందీప్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

click me!