మహాత్మాగాంధీ వర్ధంతి నాడు మాంసం గొడవ.. 21మందికి గాయాలు...

Published : Feb 01, 2022, 11:23 AM IST
మహాత్మాగాంధీ వర్ధంతి నాడు మాంసం గొడవ.. 21మందికి గాయాలు...

సారాంశం

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్ లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. 

కర్ణాటక : Meat కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. Vardhanti of Mahatma Gandhi సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్ లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. 

దీంతో వీరిద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని అస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 25న టెక్కలిలో ఇలాంటి ఘటనే జరిగింది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనే తన చేతులతో పొడిచి murder చేశాడో కసాయి తండ్రి.. liquor మత్తులో తలెత్తిన గొడవలో ఏం చేస్తున్నాడోనన్న విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన డిసెంబర్ 24 రాత్రి టెక్కలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని భూలోకమాత వీధిలో పెయింటింగ్ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు బిసాయి నాగరాజు (28). 

అతని తండ్రి లవకుశ పూలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తండ్రీ కొడుకులూ ఇద్దరూ మద్యానికి బానిసలై తరచూ గొడవపడుతుండేవారు. శుక్రవారం రాత్రి లవకుశ పందిమాంసం కోసి అమ్ముతుండగా, అక్కడికి వచ్చిన కుమారుడు నాగరాజు అమ్మిన సొమ్ములో తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య scuffle మొదలయ్యింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లవకుశ, తన చేతిలో ఉన్న Meat  కోసే కత్తితో కొడుకు పొట్టలో, పక్కటెముకల వద్ద విచక్షణా రహితంగా పొడిచాడు. 

దీన్ని గమనించిన తల్లి, సోదరి నాగరాజుును 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఎస్సై కామేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాత్రి డీఎస్పీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 

ఇదిలా ఉండగా, Nalgonda జిల్లాలో దారుణం జరిగింది.తన ఇద్దరు చిన్నారులను చంపేసి.. తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపినట్టు సమాచారం. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలలోని నూనావంత్ తండాలో డిసెంబర్ 24 రాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు కొడుకులు, భర్త చనిపోవడంతో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది.

నూనావంత్ తండాకు చెందిన గేరు కిషన్(35), భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు హర్షవర్దన్(8), అఖిల్(6)లు ఉన్నారు. తండాలో కిషన్‌కు ఒక ఎకరం పొలం ఉన్నది. ఇది సాగు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి కిషన్ మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కేడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఇటీవలే వారు మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu