
PM Narendra Modi: ప్రధాని మోడీ మరో ఘనతను అందుకున్నారు. ప్రపంచంలోని టాప్ లీడర్లకు సాధ్యం కానీ దానికి ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్ (YouTube channel) మంగళవారం నాటికి కోటి మంది సబ్‌స్క్రైబర్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆగ్ర నాయకుల యూట్యబ్ ఛానెళ్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గమనిస్తే.. ప్రధాని మోడీనే(Prime Minister Narendra Modi) టాప్‌లో ఉన్నారు. ఆయా నాయకుల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను పరంగా ప్రధాని మోడీకి చాలా దూరంలో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల గమనిస్తే.. ప్రధాని మోడీ కోటి మంది సబ్‌స్క్రైబర్లతో టాప్ లో ఉండగా, ఆ తర్వాతి స్ధానంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) 36 లక్షలు యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను కలిగి రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ (Mexican President Andrés Manuel López Obrador) (30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు), ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో (28.8 లక్షలు), అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden )7.03 లక్షల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు. వైట్ హౌస్ ఛానెల్ కు 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
కాగా, 2007 అక్టోబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'నరేంద్రమోదీ' (Narendra Modi) పేరిట యూట్యూబ్ ఛానల్ సృష్టించబడింది. ఛానెల్‌లోని కొన్ని ప్రముఖ వీడియోలలో నటుడు అక్షయ్ కుమార్‌తో అతని ఇంటర్వ్యూ , 2019లో హిందీ చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రధాని పాల్గొన్న వీడియోలు, కరోనా వైరస్ విజృంభణ సమయంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అలాగే, మోడీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలు ఈ ఛానెల్ లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఛానెల్ తో పాటు యూట్యూబ్‌లో భారత ప్రధానమంత్రి అధికారిక PMO ఇండియా (PMO India) ఛానెల్ కూడా ఉంది. దీనికి 1.69 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీని ద్వారా దేశానికి వివిధ అధికారిక ప్రకటనలు, ప్రధాని ప్రసంగాలు అందించబడుతున్నాయి.
యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ లలోనూ ప్రధాని మోడీ పాలోవర్లు అధికంగానే ఉన్నారు. ట్విట్టర్ లో 753 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఫేస్‌బుక్ 468 లక్షల మంది మోడీని అనుసరిస్తున్నారు. ఇదిలావుండగా, భారత్ లో యూట్యూబ్ లో ప్రధాని మోడీ తర్వాత అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్న నాయకుల వివరాలు గమనిస్తే.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి 5.25 లక్షలు మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) (4.39 లక్షలు), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (Tamil Nadu Chief Minister M K Stalin) (2.12 లక్షలు) ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 3.73 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా 1.37 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు.