Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌ల పార్ట్స్ లేదా సబ్-పార్ట్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం సవరించబోతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Budget 2022: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోని బీజేపీ సర్కార్ పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర పతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. మరికొద్ది సేపట్లో ఆమె పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అన్ని రంగాలు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి. గత రెండేండ్లుగా కరోనాతో బాగా దెబ్బతిన్న వివిధ రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కానీ థర్డ్ వేవ్ విజృంభణ మళ్లీ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కాబట్టి.. వివిధ రంగాలను కేటాయింపులు ఏవిధంగా ఉంటాయనేది కీలకం కానున్నాయి.
అలాగే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రవేవపెట్టబోయే.. బడ్జెట్ కాబట్టి బడ్జెట్ విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రయోజనం ఉత్పాదక రంగానికే లభిస్తుందని.. ఆ తర్వాత సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వివిధ ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్‌ల భాగాలు లేదా ఉప భాగాలపై కస్టమ్స్ సుంకాలను సవరించబోతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌లు, పెద్ద టీవీలు ఈ ఏడాది నుంచి తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బడ్జెట్ 2022 సమయంలో ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని సవరించడం వల్ల ఎలక్ట్రానిక్ రంగం మెరుగుపడుతుంది. తద్వారా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు , ఇతర వస్తువుల డిమాండ్‌లు పెరుగుతుందని భావిస్తున్నారు.
“2022-23 బడ్జెట్‌తో అసమానతను తగ్గించడానికి ముడి " అని వెస్టింగ్‌హౌస్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ అన్నారు.
వెస్టింగ్‌హౌస్ టీవీ యొక్క ఇండియా బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ PVT LTD (SPPL) వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ మాట్లాడుతూ.. అసమానతను తగ్గించడానికి ముడి పదార్థాలపై అందుబాటులో ఉన్న వాటిని ప్రతిబింబించేలా అన్ని వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌పై GSTని తగ్గించాలని రిటైల్ రంగం ప్రభుత్వాన్ని కోరుతోందని అన్నారు.
“2022-23 బడ్జెట్‌తో, అసమానతను తగ్గించడానికి ముడి పదార్థాల ధరలకనుగుణంగా ప్రభుత్వం అన్ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై జీఎస్‌టీని తగ్గించాలని ఆశిస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను అందరూ నిత్యావసరాలుగా భావిస్తున్నాం అని పల్లవి సింగ్ చెప్పారు.
దీంతో మొబైల్ ఫోన్‌లు, పెద్ద టీవీలు ఈ ఏడాది నుంచి తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సమాచారం. మరీ ఈ ఊహగానాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొద్దిసేపు వేచిచూడక తప్పదు.