సఫారీ జీప్‌పై ఖడ్గమృగాల దాడి.. 7 గురు పర్యాటకులకు గాయాలు.. పశ్చిమ బెంగాల్‌లోని జల్దపరా నేషనల్ పార్క్‌లో ఘటన

Published : Feb 26, 2023, 10:18 AM IST
సఫారీ జీప్‌పై ఖడ్గమృగాల దాడి.. 7 గురు పర్యాటకులకు గాయాలు.. పశ్చిమ బెంగాల్‌లోని జల్దపరా నేషనల్ పార్క్‌లో ఘటన

సారాంశం

ఖడ్గమృగాలు దాడి చేసిన ఘటనలో ఏడుగురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లోని జల్దపరా నేషనల్ పార్క్‌ లో సఫారీ జీప్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఖడ్గమృగాలను చూసేందుకు వాహనాన్ని ఆపడంతో అవి దాడికి పాల్పడ్డాయి. 

పశ్చిమ బెంగాల్ లోని జల్దపరా నేషనల్ పార్క్‌లో ప్రయాణిస్తున్న సఫారీ జీప్ పై రెండు ఖడ్గమృగాలు దాడి చేశాయి. దీంతో ఏడుగురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. ఎంతో ఆనందంగా ఈ సాహస యాత్రను మొదలు పెట్టిన యాత్రికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. వారంతా ఓ సఫారీ జీపుపై ప్రయాణం మొదలుపెట్టారు. వాహనం రోడ్డుపై ప్రయాణిస్తుండగా పక్కనే ఉన్న పొదల్లో కదలికలు కనిపించాయి.

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు..

అవి ఏంటో చూద్దామని పర్యాటకులు ఉత్సాహం చూపించారు. అయితే ఆ పొదల్లో రెండు ఖడ్గమృగాలు భీకర పోరాటంలో నిమగ్నమై ఉన్నాయి. దీనిని చిత్రీకరించేందుకు పర్యాటకులందరూ తమ కెమెరాలను బయటకు తీశారు. కానీ ఆ నిర్ణయం త్వరలోనే వినాశకరంగా మారుతుందని ఆ సమయంలో వారికి తెలియదు.

ఖడ్గమృగాలు భీకరంగా పోరాడుతుండగా.. పర్యాటకులు అందరూ ఫొటోలు, వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఖడ్గమృగాల దృష్టి జీపు వైపు మళ్లింది. క్షణ కాలంలోనే ఆ రెండు ఖడ్గమృగాలు సఫారీ జీప్ వైపు దూసుకుపోయాయి. అసలేం జరుగుతుందో పర్యాటకలు అర్థం కాలేదు. అప్రమత్తమైన సఫారీ జీప్ డ్రైవర్ ఖడ్గమృగాల నుంచి తప్పించుకునేందుకు ఇంజన్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. కానీ అది అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సొరంగంలోకి దూసుకుపోయింది.

షిండే Vs థాకరే:'తొలుత అహాన్ని పక్కన పెట్టాలి' : ఉద్ధవ్‌పై సీఎం షిండే ఫైర్

ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. కొందరికి ఎముకలు విరిగిపోగా, మరికొందరికి కోతలు పడ్డాయి. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది. ఈ ప్రమాదం సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పర్యాటకులను స్థానిక మదరిహట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అలీపూర్‌దువార్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జల్దాపర జాతీయ ఉద్యానవనంలో మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. తాజా ఘటనతో అధికారులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం