ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు..

Published : Feb 26, 2023, 08:42 AM ISTUpdated : Feb 26, 2023, 09:35 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సెలవుపై వచ్చిన ఆర్మీ జవాన్ ను కాల్చి చంపారు. కొన్ని రోజుల కిందట ఇంటికి వచ్చిన ఆ ఆర్మీ జవాన్ చికెన్ కొనేందుకు మార్కెట్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. కాంకేర్ ప్రాంతంలో ఓ ఆర్మీ జవాన్ ను మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడిని బడే తెవాడా నివాసి మోతీరామ్ ఆంచలగా గుర్తించారు. ఈ ఆర్మీ జవాన్ కొన్ని రోజుల క్రితం సెలవులపై తన స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు వచ్చారు. అయితే శనివారం ఉసేలిలోని చికెన్ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.

ఐటీ సిటీలో భార్యా బాధితుల నిరాహారదీక్ష... ఎందుకో తెలుసా?

ఈ వారంలో మొత్తం ఆరుగురు జవాన్లను మావోయిస్టులు హతమార్చడం గమనార్హం. ఈ వారం ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) జవాన్లు మరణించారని, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) భద్రతా సిబ్బంది మరణించారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

మృతి చెందిన డీఆర్జీ భద్రతా సిబ్బందిని ఏఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజాం జోగా, సైనిక్ వనం భీమాగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) పి.సుందర్రాజ్ తెలిపారు. డీఆర్జీ బృందం కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లిందని, వారు జాగర్గుండా, కుందేడ్ కు చేరుకోగానే నక్సల్స్ కాల్పులు జరిపారని చెప్పారు. 

"ఆయనకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి": నితీష్ పై అమిత్ షా ఫైర్

కాగా.. ఈ నెల 5న బీజాపూర్ లోని ఆవపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు నీలకంఠ కాకెమ్ ను నక్సల్స్ హతమార్చారు. 10న నారాయణపూర్ జిల్లాలో బీజేపీ ఉపాధ్యక్షుడు సాగర్ సాహును నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు కాల్చి చంపారు. ఫిబ్రవరి 11న దంతెవాడ జిల్లాలో మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేశారు.

ఇదిలా ఉండగా.. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా 4 రోజుల కిందట మావోయిస్టులు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ సింగ్‌భూమ్‌లోని చైబాసాలోని గోయిల్‌కేరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేరల్‌గడ గ్రామ సమీపంలో మావోయిస్టులు బుధవారం జరిపిన ఐఈడీ పేలుడులో 23 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అతడు కట్టెలు సేకరించేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

షిండే Vs థాకరే:'తొలుత అహాన్ని పక్కన పెట్టాలి' : ఉద్ధవ్‌పై సీఎం షిండే ఫైర్

ఈ ఘటనపై చైబాసా ఎస్పీ అశుతోష్ శేఖర్ మాట్లాడుతూ.. చైబాసాలోని గోయిల్‌కేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మేరల్‌గాడ గ్రామ సమీపంలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారని చెప్పారు. దీంతో యువకుడు చనిపోయాడని చెప్పారు. ఇది పిరికి పంద చర్యగా ఎస్పీ అభివర్ణించారు. ఉగ్ర‌వాదుల‌పై జిల్లా పోలీసులు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తార‌ని, గ్రామ‌స్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం