వితంతువుపై అత్యాచారం.. బెయిల్‌పై బయటికి: మహిళ వేషంలో వచ్చి, బాధితురాలి హత్య

Siva Kodati |  
Published : Jun 15, 2021, 04:17 PM IST
వితంతువుపై అత్యాచారం.. బెయిల్‌పై బయటికి: మహిళ వేషంలో వచ్చి, బాధితురాలి హత్య

సారాంశం

భర్త పోయి పుట్టెడు దు:ఖంలో వున్న వితంతువుపై అత్యాచారం చేయడమే కాకుండా తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోలేదని అక్కసుతో ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు నిందితుడు. సినీ ఫక్కీలో ప్లాన్ చేసిన ఆ దుర్మార్గుడు.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా మహిళ వేషంలో ఆమె ఇంటికి వెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. 

రాజస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, బాధిత మహిళ ఇరుగు పొరుగు వారే. ఈ నేపథ్యంలో నేత్రమ్ గతేడాది ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నేత్రమ్ ను అరెస్ట్ చేశారు. కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత అతను బెయిల్‌పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు ససేమిరా అనడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

Also Read:రేప్ చేసి 20 సార్లు కత్తితో పొడిచిన దుండగుడు: మహిళ మృతి

బాధితురాలు ఓ వితంతువు. తన ఇద్దరు పిల్లలు, చెల్లెలుతో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న నేత్రమ్ పథకం వేశాడు. దీనిలో భాగంగా గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం అక్కడ నిద్రిస్తున్న ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అక్కను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు