Republic TV Exit polls: యూపీలో బీజేపీకి 262 నుండి 277 సీట్లు

Published : Mar 07, 2022, 06:43 PM ISTUpdated : Mar 07, 2022, 06:49 PM IST
Republic TV Exit polls: యూపీలో బీజేపీకి 262 నుండి 277 సీట్లు

సారాంశం

యూపీ  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 262 నుండి 277 స్థానాలు దక్కించుకొంటుందని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

Uttar Praedesh రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్  టీవీ  ఎగ్జిట్ పోల్స్ లో  BJP  హవా కన్పించింది. బీజేపీకి 262-277 స్థానాలు దక్కనున్నాయి.  సమాజ్ వాదీ పార్టీకి 119 నుండి 134 సీట్లు దక్కనున్నాయని ఆ టీవీ సర్వే తెలిపింది.  కాంగ్రెస్ పార్టీకి మూడు నుండి 8 స్థానాలు దక్కే అవకాశం ఉందని కూడా ఈ సర్వే తెలిపింది.  బీఎస్పీకి  1 నుండి మూడు స్థానాలు మాత్రమే దక్కనున్నాయని ఈ సర్వే వివరించింది.

యూపీ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇవాళ్టితో ఏడు విడుతల్లో పోలింగ్ పూర్తైంది.  ఈ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని గద్దె దింపి అధికారంలోకి రావాలని Samajwadi  పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu