Russia Ukraine Crisis: మ‌రోసారి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ

Published : Mar 07, 2022, 03:34 PM IST
Russia Ukraine Crisis: మ‌రోసారి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. అయితే, ఈ యుద్ధ ప్ర‌భావం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ.. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ తో మ‌రోసారి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా మాట్లాడారు.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. అయితే, ఈ యుద్ధ ప్ర‌భావం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ.. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ తో మ‌రోసారి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఫోన్ లో ఇరు దేశాలు నేత‌లు 50 నిమిషాల‌కు పైగా సంభాషించారు. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ - ర‌ష్యా మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధ ప‌రిస్థితులు చ‌ర్చించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ప్రస్తుత ప‌రిస్థితులు.. చ‌ర్చ‌లకు సంబంధించిన అంశాల‌ను ప్ర‌ధాని మోడీకి వివ‌రించారు. 

ఇరు దేశాల బృందాల మధ్య జరుగుతున్న చర్చలతోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరపాలని ప్రధాని మోడీ.. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు.  ఈ క్ర‌మంలోనే సుమీతో సహా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్‌ల (humanitarian corridors) ఏర్పాటును ప్రధాని మోడీ అభినందించారు. సుమీ నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడం ప్రాముఖ్యతను ప్రధాని మోడీ నొక్కిచెప్పారు. వారిని సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. కాగా, రష్యా దాడుల విషయంలో జోక్యం చేసుకుని యుద్ధం  ఆపాలని ఇదివరకే పలుమార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు.. కీలన నేతలు భారత్ కోరిన సంగతి తెలిసిందే. 

ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. సైన్య ర‌హితంగా చేసేంత వ‌ర‌కు ఈ దాడి కొన‌సాగుతుంద‌ని పేర్కొంటోంది. ఇంతకుముందు రోజు  ప్రస్తుత యుద్ధ ప‌రిస్థితుల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని సైనిక స్థావ‌రాల‌ను నాశ‌నం చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ఆయుధ గిడ్డంగులు, మందుగుండు సామగ్రి డిపోలు, విమానయానం మరియు వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా ఉక్రెయిన్ కు చెందిన ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేసే  సైనిక మిటిట‌రీ మిషన్ ను రష్యా ఆచరణాత్మకంగా పూర్తి చేసిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. "రష్యన్ దళాలు తమకు కేటాయించిన అన్ని పనులను పూర్తి చేస్తాయి..  ఉక్రెయిన్‌లో ఆపరేషన్ ప్రణాళిక మరియు షెడ్యూల్‌కు అనుగుణంగా కొనసాగుతోంది" అని పుతిన్ వెల్ల‌డించారు.

అయితే, రష్యా తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడులను ఆపాలని కోరుతున్నాయి. అయితే, రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఉక్రెయిన్ పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యాపై ఆంక్ష‌లు అధికం అవుతూనే ఉన్నాయి. దీంతో ర‌ష్యాకు అర్థిక ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యాపై ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి నాటో దేశాలు. బ్యాంకింగ్‌ నుంచి ఇంధనం వరకు అన్ని రంగాలలో రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రెండు దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధ ప్ర‌భావం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డుతుంద‌నీ, మ‌రో సంక్షోభం త‌లెత్తే అవ‌కాశముంద‌ని ఐఎంఎఫ్ హెచ్చ‌రించింది. ఇప్పటికే రష్యా కరెన్సీ విలువ పడిపోతున్న సంగతి తెలిసిందే. ఇక  ఆ దేశంలోని కుబేరుల ఆస్తుల రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu