Republic Day Parade 2022 : మార్గదర్శకాలు విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు.. వీరికి మాత్రమే అనుమతి...

Published : Jan 24, 2022, 12:21 PM IST
Republic Day Parade 2022 : మార్గదర్శకాలు విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు.. వీరికి మాత్రమే అనుమతి...

సారాంశం

జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం లాంటి అన్ని Covid-protocolలను తప్పనిసరిగా పాలించాలని పోలీసులు తెలిపారు. “కరోనావైరస్ వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని.. దీనికి సంబంధించిన టీకా సర్టిఫికెట్ తప్పనిసరిగా తమతో తీసుకురావాలని అభ్యర్థించారు’’ అని ఢిల్లీ పోలీసులు tweet చేశారు.

న్యూఢిల్లీ : Republic Day Parade 2022కి హాజరయ్యే వ్యక్తులు తప్పనిసరిగా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా fully vaccinated అయి ఉండాలని.. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫంక్షన్‌కు హాజరు కావడానికి అనుమతించబడరని ఢిల్లీ పోలీసులు  జారీ చేసిన guidelinesల్లోపేర్కొంది.

జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం లాంటి అన్ని Covid-protocolలను తప్పనిసరిగా పాలించాలని పోలీసులు తెలిపారు. “కరోనావైరస్ వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని.. దీనికి సంబంధించిన టీకా సర్టిఫికెట్ తప్పనిసరిగా తమతో తీసుకురావాలని అభ్యర్థించారు’’ అని ఢిల్లీ పోలీసులు tweet చేశారు.

అంతేకాదు, 15 ఏళ్ల లోపు పిల్లలను ఈ కార్యక్రమానికి అనుమతించబోమని పేర్కొంది. గత ఏడాది జనవరి 16న ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులతో ప్రారంభించిన జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం క్రమంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి ఇవ్వబడింది. ఈ నెల నుండి, 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించారు. ఇక Omicron వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల మధ్య, ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కొమొర్బిడిటీలకు 'precaution' డోసులు ఇస్తున్నారు. 

ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన మార్గదర్శకాల లిస్టులో.. ఉదయం 7 గంటలకు సందర్శకుల కోసం సీటింగ్ బ్లాక్‌లు తెరుస్తారని.. తదనుగుణంగా జనాలు రావాలని అభ్యర్థించారు. పార్కింగ్ లిమిటెడ్ గా ఉన్నందున సందర్శకులు కార్‌పూల్ లేదా టాక్సీని వాడాలని సలహా ఇచ్చారు. అంతేకాదు తమతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకురావాలని, సెక్యూరిటీ చెకప్ సమయంలో సిబ్బందికి సహకరించాలని కూడా అభ్యర్థించారు.

"ప్రతి పార్కింగ్ ఏరియాలో రిమోట్ కంట్రోల్డ్ కార్ లాక్ కీలను డిపాజిట్ చేసే సదుపాయం ఉంటుంది" అని పోలీసులు ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో భద్రతా విధుల కోసం 27,000 మంది పోలీసులను మోహరించినట్లు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేసినట్లు ఆదివారం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు.

ఈ సిబ్బందిలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోలీసు సిబ్బంది, కమాండోలు, అధికారులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) జవాన్‌లను కూడా మోహరించినట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ భద్రతా ఏర్పాట్ల సందర్భంగా, పరేడ్ కోసం 71 మంది డిసిపిలు, 213 ఎసిపిలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు సహా 27,723 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని రాజధానిలో మోహరించినట్లు అస్థానా తెలిపారు. వీరికి 65 కంపెనీల CAPFలు సహాయం చేస్తున్నాయి.

వివిధ ప్రదేశాలలో దిగ్బంధనాలు (నాకాబందీ), వాహనాలు, హోటళ్లు, లాడ్జీలు, ధర్మశాలల తనిఖీలు.. అద్దెకు తీసుకున్నవారు, సర్వెంట్లు, కార్మికులు వంటి వారివివిధ ధృవీకరణలు చేయడం ఈ డ్రైవ్‌లు తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

గత రెండు నెలల్లో ఉగ్రవాద నిరోధక చర్యలు ముమ్మరం చేశామని కమిషనర్ తెలిపారు. ఎయిర్ స్పేస్ సెక్యూరిటీ కోసం కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతంలో, చుట్టుపక్కల భద్రతను కూడా ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో భద్రపరిచినట్లు అస్థానా తెలిపారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు వాస్తవాలను, ముఖ్యమైన సమాచారాన్ని కూడా బయటపెడుతున్నారని, తద్వారా ఎలాంటి సామాజిక వ్యతిరేక ఎలిమెంట్‌లు తప్పుడు సమాచారం ప్రచారం చేయలేదని ఆయన అన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి, సాధారణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెళ్లాల్సిన రూట్ల మీద నిర్దిష్ట పరిమితులను పేర్కొంటూ ఇప్పటికే ఒక అడ్వైజరీ జారీ చేయబడిందని అస్థానా చెప్పారు.

ఇటీవలి ఉత్తర్వు ప్రకారం, గణతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా దేశ రాజధానిలో UAVలు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌లతో సహా sub-conventional aerial ప్లాట్‌ఫారమ్‌లను ఆపరేట్ చేయడం నిషేధించబడింది. ఈ ఉత్తర్వు జనవరి 20 నుండి అమలులోకి వచ్చింది.  ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu