భార్యతో అసభ్య ప్రవర్తన.. యువకుడి కంట్లో ఐసుముక్కతో పొడిచిన భర్త..

By SumaBala BukkaFirst Published Jan 24, 2022, 10:44 AM IST
Highlights

బాధితుడు బబ్లూ.. కుక్రేజా ఆస్పత్రి సమీపంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఊరుకోకుండా దుర్భాషలాడడంతో.. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె భర్త బబ్లూతో వాగ్వివాదానికి దిగాడు. అది క్రమంగా ముదరింది. 

న్యూఢిల్లీ : తన భార్యతో Obsceneగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిమీద దాడి చేసిన నిందితుడు అతడి eyeలో ఐసు ముక్కతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దేశ రాజధాని ఢిల్లీలోని టాగోర్ గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు స్థానికులకు చిక్కగా వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు బబ్లూ.. కుక్రేజా ఆస్పత్రి సమీపంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఊరుకోకుండా దుర్భాషలాడడంతో.. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె భర్త బబ్లూతో వాగ్వివాదానికి దిగాడు. అది క్రమంగా ముదరింది. దీంతో పట్టలేని కోపంతో ఎలాగైనా బబ్లూ పని పట్టాలనుకున్నాడు. తన స్నేహితులకు సమాచారం అందించి పిలిపించాడు. వారిలో కలిసి బబ్లూ మీద దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగా మంచు ముక్కతో బబ్లూ కుడి కంటిలో పొడిచాడు.

అప్పటికే గొడవకు అక్కడికి చేరుకున్న స్థానికులు ఇది గమనించారు. వెంటనే నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరి వయసు 28 యేళ్లు కాగా, ఓ బాలుడు కూడా ఉన్నాడు. వీరిని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందిుతలను అంజు, నిలోపతిగా గుర్తించామని, మరో నిందితుడు సోహన్ ఠాకూర్ (30) పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గురు గోవింద్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కోలుకుంటున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ bank employee భార్య suicide చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ... తాడిమర్రిలోని SBI శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో YSR District పొద్దుటూరు కు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేసి.. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్త ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

click me!