up assembly election 2022 : గోరఖ్‌పూర్ మఠం బంగ్లా కంటే త‌క్కువేం కాదు : యోగిపై మాయావతి మండిపాటు

By team teluguFirst Published Jan 24, 2022, 11:34 AM IST
Highlights

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పై విరుచుకుపడ్డారు. యోగి తన నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో ఎక్కువ కాలం పాటు ఉండే మ‌ఠం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని అన్నారు. మయావతి ఆదివారం వ‌రుస ట్వీట్ లు చేశారు

బహుజన్ సమాజ్ పార్టీ (bsp) అధినేత్రి మాయావతి (mayavathi) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (yogi adhityanath)పై విరుచుకుపడ్డారు. యోగి తన నియోజకవర్గం గోరఖ్‌పూర్‌ (gorakhpur)లో ఎక్కువ కాలం పాటు ఉండే మ‌ఠం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని అన్నారు. మయావతి ఆదివారం వ‌రుస ట్వీట్ లు చేశారు. హీందీలో చేసిన ఈ ట్వీట్ల‌లో ఆదిత్య‌నాథ్పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘ గోరఖ్‌పూర్‌లో యోగి జీ ఎక్కువ సమయం ఉండే మఠం పెద్ద బంగ్లాను ఏం తీసిపోయేలా ఉండ‌ద‌ని పశ్చిమ యూపీ ప్ర‌జ‌ల‌కు బ‌హుశా తెలిసి ఉండ‌దు.ఈ విషయం ఆయనే చెబితే బాగుండేది.’’ అని పేర్కొన్నారు. 

సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌తిప‌క్ష పార్టీలను ల‌క్ష్యంగా చేసుకొని ఆదివారం నాడు ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పూర్వీకులు అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలోనే వారి కోసం బంగ్లాలు నిర్మించుకున్నార‌ని ఆరోపించారు.  ఘజియాబాద్‌లో ప్ర‌చారం నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో స‌మాజ్ వాదీ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు సీఎం, మంత్రులు ముందుగా బంగ్లాలు నిర్మించుకున్నారని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో త‌న‌కు, త‌న మంత్రుల‌కు సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేద‌ని అన్నారు. రాష్ట్రంలోని 43 లక్షల మంది పేదలకు ఇళ్ల క‌ట్టి ఇచ్చామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని 2 కోట్ల 61 లక్షల మందికి మరుగుదొడ్లు కూడా బీజేపీ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్య‌ల‌కే మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన ప‌నుల‌ను యోగి ప్ర‌స్తావించి ఉండాల్సింద‌ని అన్నారు. ప్ర‌స్తుత సీఎం యోగి బీజేపీ ప‌ని తీరును ప్రశంసిస్తూనే, తాము ప్ర‌జ‌ల కోసం చేసిన ప‌నులు చెప్పి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బీఎస్పీ ప్ర‌భుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పేదలకు, భూమి లేని వారికి ఇళ్లు ఇచ్చామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో బీఎస్పీ ప్ర‌భుత్వం రికార్డు నెల‌కొల్పింద‌ని వారు (బీజేపీ) తెలుసుకోవాల‌ని మాయ‌వ‌తి అన్నారు. ‘‘బీఎస్పీ ప్రభుత్వం ద్వారా మాన్యవర్ కాన్షీరామ్ జీ షహరీ గరీబ్ ఆవాస్ యోజన కింద, కేవలం రెండు దశల్లో లక్షన్నరకు పైగా పక్కా ఇళ్లు ఇచ్చాము. సర్వజన్ హితాయ గరీబ్ హౌసింగ్ ఓనర్‌షిప్ పథకం కింద అనేక కుటుంబాలు ప్రయోజనం పొందాయి. లక్షలాది మంది భూమిలేని కుటుంబాలకు భూమి కూడా అందించాము’’ అని ఆమె ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.  ఉత్తరప్రదేశ్‌లో 403 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఫిబ్రవరి 10, 14, 20, 23, 27. మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

click me!