ప్రేమోన్మాది.. కాలేజీ చదివే రోజుల్లో ప్రేమను రిజెక్ట్ చేసిందని.. నాలుగేళ్ల తరువాత యువతిపై విచక్షణారహిత దాడి..

By SumaBala BukkaFirst Published Feb 2, 2023, 11:18 AM IST
Highlights

నాలుగేళ్ల క్రితం ప్రేమను నిరాకరించందని.. మాజీ బ్యాచ్ మేట్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేశాడో ప్రేమోన్మాది. ఈ ఘటన అహ్మదాబాద్ లో కలకలం రేపింది. 

అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది వివాహిత మీద కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందని.. నాలుగేళ్ల తరువాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ వివాహిత తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. చంద్‌ఖేడాకు చెందిన 24 ఏళ్ల యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్యాచ్‌మేట్ ప్రతిపాదనను తిరస్కరించింది. నాలుగేళ్ల తర్వాత, ఆమెను వెతుక్కుంటూ వచ్చిన అతను.. పలుమార్తు కత్తితో పొడిచారు. కాలేజీ రోజుల్లో అతనితో రిలేషన్ ను నిరాకరించినందుకు బ్యాచ్‌మేట్ తన గొంతు కోసి, పలుమార్లు కత్తితో పొడిచి చంపాడానికి ప్రయత్నించాడని ఆమె చంద్‌ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. తల్లి, కూతురు మృతి..

బాధితురాలు రిద్ధి సోని గాంధీనగర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ప్రాసెస్ అసోసియేట్‌గా పనిచేస్తోంది.  ఆమె తన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ బ్యాచ్‌మేట్, అస్టోడియాలోని ధాల్ ని పోల్‌లో నివాసం ఉంటున్న సర్వేష్ రావల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది. మంగళవారం ఉదయం అతను సడెన్ గా తన ఇంట్లో ప్రత్యక్షమయ్యాడని తెలిపింది. తన భర్త యష్ సోనీ, టిసిఎస్‌లో పనిచేస్తున్నాడని.. రావల్ వచ్చిన సమయంలో అతను కూడా ఇంట్లో ఉన్నారని తెలిపింది. 

ఇన్నేళ్ల తరువాత తనకు సర్ ఫ్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్లు రావల్ తెలిపాడు. అంతేకాదు తన బ్యాచ్ మేట్స్ మరికొంతమంది కూడా వస్తున్నారని చెప్పాడు. ఆమె ఇది నిజమే అని నమ్మింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన అడ్రస్ ఎలా కనుక్కున్నావని అడిగితే, మరొక కాలేజీ బ్యాచ్‌మేట్ నుండి తీసుకున్నానని చెప్పాడు. రావల్, రిద్దీ, యష్ లతో కాసేపు మాట్లాడాడు. ఆ తరువాత సోనీ రావల్ కు టీ పెట్టి ఇచ్చింది. 

మరికొంతమంది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పడంతో.. వారికి టీ ఇచ్చే ఉద్దేశ్యంతో భర్తను పాలు తెమ్మని చెబితే.. అతను బైటికి వెళ్లాడు. ఆ సమయంలో సోనీ.. రావల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లింది. అయితే "అతను అకస్మాత్తుగా నా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి, నా జుట్టును పట్టి లాగి, నా గొంతు కోయడానికి ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన నేను కత్తిని పట్టుకుని నన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించాను. మెడకు అరచేయి అడ్డుపెట్టడంతో నా అరచేతిపై కత్తిగాట్లు పడ్డాయి. నేను గొంతు కోయనివ్వకపోవడంతో.. నా వెనుకభాగంలో చాలాసార్లు కత్తితో.. నేను తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. నా మోకాళ్ల మీద కత్తితో కోశాడు’’ అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

అతని నుంచి ఎలాగో తప్పించుకుని సహాయం కోసం కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తడంతో రావల్ పారిపోయాడు. యష్ పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి, సోని తీవ్ర రక్తస్రావంతో కిందపడి కనిపించింది. వెంటనే అతను పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి.. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చంద్‌ఖేడా పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేసి.. ఆ తర్వాత, రావల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

click me!