స్నేహితుడిని చంపి.. కొండమీదినుంచి పారేయబోయి.. పట్టుతప్పి, కిందపడి దుర్మరణం..

By SumaBala BukkaFirst Published Feb 2, 2023, 10:31 AM IST
Highlights

స్నేహితుడిని చంపి మృతదేహాన్ని పారేయబోయి.. తానూ చనిపోయిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్నేహితుడితో గొడవ పడి హత్య చేశాడు. 

ముంబై : స్నేహితుల మధ్య డబ్బు విషయంలో గొడవ వచ్చింది. దీంతో కోపానికి వచ్చిన ఓ వ్యక్తి స్నేహితుడికి చంపేశాడు. ఆ తరువాత మరో స్నేహితుడితో కలిసి మృతదేహాన్ని కొండమీదినుంచి కిందికి వేయడానికి వెళ్లాడు. అయితే... మృతదేహాన్ని పారేసే సమయంలో అదుపుతప్పి అతను లోయలో పడి మరణించాడు. ఈ ఘటన నవీ ముంబైలోని సావంత్‌వాడిలోని అంబోలి ఘాట్ వద్ద ఆదివారం జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. గొడవల కారణంగా స్నేహితుడిని హత్య చేసి, మరో స్నేహితుడితో కలిసి మృతదేహాన్ని పారవేసే ప్రయత్నంలో సావంత్‌వాడిలోని అంబోలి ఘాట్ వద్ద నిటారుగా ఉన్న కొండ వాలుపై పడి అతను మరణించాడు. అతనితో పాటు సహాయంగా వచ్చిన వ్యక్తి అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

మృతుడు భౌసో మానే, అతని సహాయకుడు తుషార్ పవార్ (28) డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివాదంలో ఆదివారం సుశాంత్ ఖిల్లారే (30) అనే వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. ఈ ముగ్గురూ సతారాలోని కరాడ్ నివాసితులు. "ఖిల్లారే మృతదేహాన్ని పడవేయడానికి మానే, పవార్ అంబోలి ఘాట్‌కు కారులో 400 కి.మీ ప్రయాణించారు. అయితే ఘాట్ వద్ద, మృతదేహాన్ని పడేస్తున్న సమయంలో మానే బ్యాలెన్స్ కోల్పోయి, మృతదేహంతో పాటు కిందపడి మరణించాడు" అని వారు తెలిపారు.

బళ్లారి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి

మానేతో వచ్చిన పవార్ ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన పవార్.. భయంతో దగ్గర్లోని గుడికి వెళ్లాడు. అతని కుటుంబాన్ని పిలిచి చేసిన నేరం దేవుడి ముందు ఒప్పుకున్నాడు" అని తెలుస్తోంది. కాగా, మంగళవారం స్థానికులు ఒకరు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నేరం వెలుగులోకి వచ్చింది. సమచారం అందడంతో సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ గోటేతో కలిసి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రెండు మృతదేహాలను బయటకు తీశారు. రెండు మృతదేహాలు ఒకదానికొకటి 10 అడుగుల దూరంలో, 150 అడుగుల లోతులో పడి ఉండడం కనుగొన్నారు. సావంత్‌వాడి పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ, "అంబోలి ఘాట్ లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.  దీంతో ఇక్కడ మృతదేహాలను డంపింగ్ చేయడానికి 'అనుకూల ప్రదేశం'గా ఒకప్పుడు పేరు పడ్డది. గత మూడేళ్లలో ఈ ప్రాంతంలో మరో రెండు మృతదేహాలను పడేశారు. అప్పటి నుండి, టూరిస్ట్ ఫుట్‌ఫాల్ రూట్‌లో అనేక సీసీటీవీలను ఏర్పాటు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఆయన తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ ఎఫ్‌బి మెంగ్డే మాట్లాడుతూ, "ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా ప్రస్తుతం కేసు నమోదు చేసాం. ముగ్గురి కుటుంబ సభ్యులను విచారించి, ఆపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తాం" అని తెలిపారు. సింధుదుర్గ్ ఎస్పీ సౌరభ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా ఈ హత్యకు కారణం డబ్బు సమస్యగా తెలుస్తోంది అన్నారు. 

click me!