బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. తల్లి, కూతురు మృతి..

By Asianet NewsFirst Published Feb 2, 2023, 10:52 AM IST
Highlights

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు మరణించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే మహిళ తన కూతురును స్కూల్ లో వదిలిపెట్టేందుకు కారులో బయలుదేరింది. ఈ సమయంలో ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. 

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ మిక్సర్ ట్రక్ బ్యాలెన్స్ తప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు మరణించారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే మిక్సర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

స్నేహితుడిని చంపి.. కొండమీదినుంచి పారేయబోయి.. పట్టుతప్పి, కిందపడి దుర్మరణం..

వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేసే 47 ఏళ్ల గాయత్రి అనే మహిళ తన 15 ఏళ్ల కుమార్తె సమతను స్కూల్ లో దింపేందుకు కారులో బయలుదేరింది. అయితే ఉదయం 7.35 గంటల సమయంలో కగాలిపుర బన్నెరఘట్ట రోడ్డులోని బైలమర దొడ్డి వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ఓ సిమెంట్ మిక్సర్ లారీ వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న తల్లీ కూతుర్ల ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. 

బళ్లారి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి

ప్రమాదం అనంతరం డ్రైవర్‌ లారీని అక్కడికక్కడే వదిలేసి పరారయ్యాడు. మృతులు ఇద్దరూ కాంకర్డ్ వ్యాలీ నివాసితులు. గాయత్రి ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు కూతురు బన్నెరఘట్ట మెయిన్ రోడ్డులోని బసవనపురలోని షేర్‌వుడ్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. కాగా.. ఈ ప్రమాదంపై గాయత్రి భర్త సునీల్ కుమార్ బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కారులో బ్లూలింక్ సాఫ్ట్‌వేర్ అమర్చి ఉందని, దీని ద్వారా 7:49కి తన కారు ఆటో క్రాష్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చిందని సునీల్ పేర్కొన్నారు. 

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్, వామపక్షాల మధ్య కుదిరిన సయోధ్య.. పోటీ చేసే స్థానాలపై స్పష్టత

కాంక్రీట్ మిక్సర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను నాలుగు క్రేన్లు, జేసీబీ సాయంతో వెలికితీశారు. తదుపరి విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

పంజాబ్ లో పాక్ డ్రోన్స్ కలకలం.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం..

రెండు రోజుల కిందట హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కూడా ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అప్పా జంక్షన్ వద్ద ఓఆర్‌ఆర్‌పై లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఎగ్జిట్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు  అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. 
 

click me!