దీర్ఘకాలం సెక్స్‌ను నిరాకరించడం మానసిక క్రౌర్యమే.. విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

By Mahesh KFirst Published May 26, 2023, 3:43 PM IST
Highlights

జీవిత భాగస్వామితో దీర్ఘకాలం సెక్స్‌లో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. వారణాసి ఫ్యామిలీ కోర్టు విడాకులను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
 

న్యూఢిల్లీ: జీవిత భాగస్వామితో సెక్స్‌ను దీర్ఘకాలం ఎలాంటి తగిన కారణం లేకుండా నిరాకరించడం మానసిక క్రూరత్వమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఆ దంపతులకు విడాకులనూ మంజూరు చేసింది. సుమారు 14 సంవత్సరాలు వేరుగా ఉండి.. తగిన కారణం చూపెట్టకుండా భర్తను శృంగారానికి దూరంగా పెట్టడం మానసిక క్రూరత్వమే అవుతుందని, ఆ దంపతులకు అలహాబాద్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

పిటిషనర్ రవింద్ర ప్రతాప్ యాదవ్ తన భార్యతో విడాకులు ఇప్పించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వైవాహిక బంధం అంటే ఆమెకు గౌరవమే లేదని పేర్కొన్నారు. ఆ బంధంలోని బాధ్యతలనూ ఆమె నెరవేర్చలేదని, తమ బంధం మళ్లీ పునరుద్ధరించలేని విధంగా మారిపోయిందని తెలిపారు.

వారణాసి ఫ్యామిలీ కోర్టు తీర్పును కొట్టేయాలని ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వారణాసి ఫ్యామిలీ కోర్టు.. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13ను పేర్కొంటూ వారి విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే, వారణాసి ఫ్యామిలీ కోర్టు హైపర్ టెక్నికల్ అప్రోచ్ విధానాన్ని ఎంచుకుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అందుకే యాదవ్ కేసును డిస్మిస్ చేసిందని వివరించింది.

రవీంద్ర ప్రతాప్ యాదవ్ విడాకులను కోరారు. పెద్దల సమక్షంలో తమకు విడాకులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఉండటాన్ని ఆమె నిరాకరిస్తూ మానసిక క్రూరత్వానికి ఆమె పాల్పడిందని వివరించారు. దీర్ఘకాలంగా తాము వేర్వేరుగా ఉంటున్నామని వాదించారు.

యాదవ్ ప్రకారం, 1979 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమె భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనతో కలిసి ఉండటానికి ఆమె తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని వివరించారు. పెళ్లయ్యాక ఆరు నెలలకు యాదవ్ ఆమె చెంత చేరి తిరిగి తన వద్దకు రావాలని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె నిరాకరించారు.

Also Read: మహేశ్ బాబు కూతురు సితార రికార్డు.. ప్రముఖ జ్యుయెల్లరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా స్టార్ కిడ్

1994 జులైలో పెద్దల సమక్షంలో ఒక పంచాయితీ జరిగింది. ఇద్దరూ పరస్పరం విడిపోవడానికి అంగీకరించారు. భార్యకు తాను రూ. 22 వేల పరిహారం అందించానని చెప్పారు. మానసిక క్రూరత్వం, ఇతర కారణాలపై తనకు విడాకులు ఇచ్చే అంగీకారాన్ని కోర్టుకు తెలపడానికి ఆమె హాజరు కాలేదు.

దీర్ఘకాలంగా తన జీవిత భాగస్వామిని శృంగారానికి నిరాకరించడం, అదీ ఎలాంటి కారణం లేకుండా దూరం పెట్టడం నిస్సందేహంగా మానసిక క్రూరత్వమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు సునీత్ కుమార్, రాజేద్ర కుమార్‌ల ధర్మాసనం తెలిపింది. కాబట్టఇ, తన జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని పిటిషనర్‌ను బలవంతం చేయలేమని వివరించింది. ఆ దాంపత్య ఎప్పుడో ముగిసిపోయిందనీ పేర్కొంది. 

click me!