Red Sanders: అంత‌రించిపోతున్న‌ ఎర్ర చంద‌నం..

By Rajesh KFirst Published Jan 23, 2022, 3:26 PM IST
Highlights

Red Sanders: ఎర్ర చంద‌నం ప్ర‌స్తుతం అంత‌రించిపోయే జాబితాలోకి చేరాయి. ఐయూసీఎన్ రెడ్ లిస్టులోని ఎండేంజ‌ర్డ్ జాబితాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సైట్స్ అపెండిక్స్ 2లో ఇండియాలోని వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ యాక్ట్ 1972 షెడ్యూల్ 2లో వీటిని చేర్చారు.
 

Red Sanders: ప్రపంచం అరుదైన మొక్క ఎర్రచందనం. ఈ చెట్లు కేవ‌లం భార‌త్ లోనే పెరుగుతాయి.  అందులోనూ ముఖ్యంగా తూర్పు క‌నుమ‌ల్లో ఈ చెట్లు పెరుగాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌ల్లో ఎర్ర‌చంద‌నం చెట్లు విస్తరించి ఉన్నాయి. 

ఏపీలో చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను చికిత్స‌లు, ఔష‌ధాల్లో వాడ‌తారు. ఈ చెట్ల‌లో మంచి ఔష‌ధ గుణాలున్నాయి. వ‌స్తువులు చేయ‌డానికి కూడా వాడ‌తారు.

ఈ  అరుదైన జాతి చెట్ల‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక ట‌న్ను ఎర్ర చంద‌న దాదాపు రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ. కోటి వ‌ర‌కు ప‌లుకుతున్న‌ట్టు అంచ‌నా. చైనా, జపాన్, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

దీంతో ఈ చెట్ల‌ను పెద్ద‌సంఖ్య‌లో న‌రికి వేయ‌డంతో అంత‌రించిపోతున్నాయి. ఎర్ర చంద‌నాన్ని అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉన్న జాబితాలో ఐయూసీఎన్ చేర్చింది. ఐయూసీఎన్ విడుద‌ల చేసిన‌ రెడ్ లిస్టులోని ఎండేంజ‌ర్డ్ జాబితాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సైట్స్ అపెండిక్స్ 2లో ఇండియాలోని వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ యాక్ట్ 1972 షెడ్యూల్ 2లో వీటిని చేర్చారు.

click me!