ఓట్లు చీల్చడం తప్ప ఉపయోగం ఏంటీ: కాంగ్రెస్‌పై మాయావతి విమర్శలు

By Siva KodatiFirst Published Jan 23, 2022, 3:16 PM IST
Highlights

కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థి గంటల వ్యవధిలోనే తన విధానాన్ని మార్చుకుంటారని.. అలాంటప్పుడబు ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి దుర్వినియోగం చేసుకోవద్దుఅని మాయావతి హితవు పలికారు

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు (up assembly polls) సమయం దగ్గరపడుతుండటంతో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ (bsp) అధినేత్రి మాయావతి (mayawati) తిరిగి యాక్టీవ్ అవుతున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక గాంధీని (priyanka gandhi) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్తించారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థి గంటల వ్యవధిలోనే తన విధానాన్ని మార్చుకుంటారని.. అలాంటప్పుడబు ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి దుర్వినియోగం చేసుకోవద్దుఅని మాయావతి హితవు పలికారు. ఈ విడత ఎన్నికల్లో మాయావతి పోటీకి దూరంగా ఉండడం తెలిసిందే. అయినా సరే పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ఆమె ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు.

ఇదిలా ఉంటే..  యూపీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను భుజాన‌వేసుకుని ముందుకు వెళ్తున్నారు  కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంకా గాంధీ. ఇప్ప‌టికే బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు  సీఎం అభ్య‌ర్థులు ప్ర‌క‌టించారు. కానీ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ నే కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే.. ప‌లు మార్లు తానే ముఖ్యమంత్రి అని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. పదేపదే అదే ప్రశ్నను అడగడం వల్ల చిరాకు వ‌స్తుందని అన్నారు. ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. నన్నే ఎందుకు అనుకోకూడదు..?” అని  ప్ర‌శ్నించచారు.  ఆ వెంట‌నే తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు.

శుక్రవారం, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 'భారతీ విధాన్' అనే ఉత్తరప్రదేశ్ యూత్ మ్యానిఫెస్టోను ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు ? అనే  మీడియా ప్ర‌శ్నించింది.  ఈ విష‌యంపై మ‌రోసారి జాతీయ మీడియా ప్రియాంక గాంధీ వాద్రాను సంప్ర‌దించింది. “నేను (ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో (కాంగ్రెస్ సీఎం) అని చెప్పడం లేదు... మీరందరూ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి (మీకు ప్రతిచోటా నా ముఖం కనిపిస్తుంది) చికాకుతో అన్నాను. ” అని  ప్రియాంక గాంధీ  అన్నారు. అదే స‌మయంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.
 

click me!