హైజాక్ బెదిరింపులు... చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌

By Siva KodatiFirst Published Mar 4, 2019, 12:16 PM IST
Highlights

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం విమానం హైజాక్ వార్తలు కలకలం సృష్టించాయి. పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

దేశంలోని మెట్రో నగరాలతో పాటు ప్రముఖ నగరాల్లో తీవ్రవాదులు విధ్వంసానికి దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే వారిని విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. అలాగే సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు. 

click me!