భార్య చెల్లెలిని బంధించి అత్యాచారం.. బావ అరెస్ట్

Published : Mar 04, 2019, 11:15 AM IST
భార్య చెల్లెలిని బంధించి అత్యాచారం.. బావ అరెస్ట్

సారాంశం

మరదలిని ఓ ఇంట్లో బంధించి.. పలుమార్లు అత్యాచారం చేసాడు ఓ యువకుడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

మరదలిని ఓ ఇంట్లో బంధించి.. పలుమార్లు అత్యాచారం చేసాడు ఓ యువకుడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.  ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... పెరియపాల్యంకి చెందిన అజిత్ కుమార్(22) అనే యువకుడు ఓ మొబైల్ సేల్స్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతనికి 20 రోజుల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. కాగా.. అజిత్ భార్యకి ఏడో తరగతి చదివే చెల్లెలు ఉంది. ఆ బాలిక వారి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే  ఓస్కూల్లో చదువుతోంది.

కాగా.. ఆ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అని కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో అజిత్ కుమార్ నేరస్థుడు అని తేలింది.

బాలిక.. స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. అజిత్ కుమార్ ఆమెను పికప్ చేసుకొని.. తన మొబైల్ స్టోర్స్ కి తీసుకువెళ్లాడు. అక్కడే ఆమెను బంధించి.. నాలుగు రోజులపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. బాలికను రాక్షసుడి చెర నుంచి విడిపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?