
Punjab and Haryana HC: గత కొంత కాలంగా దేశంలో వ్యక్తిగత గొప్యత అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కేసు విచారణ సందర్బంగా గోప్యతపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ సంభాషణలను దొంగచాటుగా రికార్డు చేయడం ముమ్మటీకి తప్పేనని హైకోర్టు పేర్కొంది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని స్ఫష్టం చేసింది. వివరాల్లోకెళ్తే... పంజాబ్ రాష్ట్రంలోని భటిండాకు ఓ కుటుంబంలో భార్యభర్తల మధ్య గొడవలు చివరకు కోర్టుకు చేరాయి. ఓ వ్యక్తి భార్య (Wife) తనను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ.. తనకు భార్య నుంచి విడాకులు (Divorce) ఇప్పించాలని కోరుతూ.. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య తనను వేధింపులకు గురిచేస్తున్న అంశాలకు సాక్ష్యంగా తన భార్య ఫోన్ కాల్ రికార్డులను (Phone Recordings) అందిస్తానని తెలుపగా న్యాయస్థానం దానికి అంగీకరించింది.
Also Read: Justice Chandru: అవగాహన లేని మాటలు.. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
అయితే, ఆ వ్యక్తి కోర్టుకు తన భార్య ఫోన్ కాల్ రికార్డులను న్యాయస్థానానికి అందించాడు. ఇక్కడే ఈ కేసులు కీలక మలుపు తిరిగింది. తన ఫోన్ కాల్స్ రికార్డు చేయడంపై ఆ వ్యక్తి భార్య హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేశాడని పేర్కొంటూ ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత గోప్యతపై గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం ఆమె గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు (Punjab and Haryana High Court) స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని భర్త తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని వాదనలు వినిపించాడు. కాదని భర్త తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు .
Also Read: Farooq Abdullah | దేశ విభజనపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు !
ఇక భార్యభర్తల వాదనలు విన్న న్యాయస్థానం.. భర్త అందించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్, సిమ్ కార్డులను సాక్షాలుగా పరిగణించలేమని పేర్కొంది. అలాగే, భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఓ వ్యక్తి అందించిన ఫోన్ కాల్ రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా విడాకులపై భటిండా న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దీని కోసం భటిండా ఫ్యామిలీ కోర్టుకు ఆరు నెలల సమయం ఇచ్చింది హైకోర్టు. ఇదిలావుండగా, దక్షిణాది రాష్ట్రమైన కేరళలో విడాకుల కేసు సందర్భంగా వివాహ బంధానికి సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో భర్త శృంగారంలో పాల్గొంటే అది వైవాహిక లైంగికదాడి అవుతుందంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.
Also Read: పార్లమెంట్‌లో CBSE రగడ.. క్షమాపణలకు సోనియా డిమాండ్ !