కర్ణాటక క్రైసిస్: రెబెల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన సుప్రీం

By narsimha lodeFirst Published Jul 17, 2019, 10:47 AM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలో రెబెల్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 

బెంగుళూరు: కర్ణాటకలో నిర్ణీత కాలవ్యవధిలోనే రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని  తాము స్పీకర్‌ను ఆదేశించలేమని సుప్రీంకోర్టు  తేల్చి చెప్పింది.

తమ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడం లేదంటూ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మంగళవారం నాడు రెండు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు వింది. బుధవారం నాడు ఉదయం ఈ విషయమై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును వెల్లడించారు.

రెబెల్ ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటక అసెంబ్లీలో గురువారం నాడు విశ్వాస పరీక్ష నిర్వహించుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణీత కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. రాజీనామాలపై నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్‌దేనని తేల్చి చెప్పింది. 

గురువారం నాడు అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బలపరీక్షకు హాజరయ్యే విషయంలో రెబెల్ ఎమ్మెల్యేలే  నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

click me!