ఎస్పీ, బిఎస్పీ పొత్తు: తెర వెనుక సూత్రధారి ఎంపీ సేథ్

By narsimha lodeFirst Published Jan 13, 2019, 1:54 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  ఎస్పీ, బీఎస్పీల మధ్య పొత్తు వ్యవహరంలో  ఓ ఎంపీ కీలకంగా వ్యవహారించారనే ప్రచారం సాగుతోంది.


న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  ఎస్పీ, బీఎస్పీల మధ్య పొత్తు వ్యవహరంలో  ఓ ఎంపీ కీలకంగా వ్యవహారించారనే ప్రచారం సాగుతోంది.

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమి  పోటీ చేయనున్నాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు.
అయితే ఈ రెండు పార్టీల మధ్య  పొత్తు విషయంలో  ఒకరు కీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

బీఎస్పీ అధినేత్రి మాయావతికి  సతీష్ చంద్ మిశ్రా అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.  అతను బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కూడ కొనసాగుతున్నారు. మరో వైపు సమాజ్ వాదీ పార్టీ  ఎంపీ సంజయ్ సేథీ‌లు కూడ పొత్తు వ్యవహరంలో  కీలక పాత్ర పోషించారనే చర్చ సాగుతోంది.

శనివారం నాడు అఖిలేష్ యాదవ్, మాయావతి లక్నోలో నిర్వహించి ఉమ్మడి విలేకరుల సమావేశానికి  మిశ్రా పార్టీ ఎన్నికల గుర్తు ఉన్న నీలం రంగు టై ధరించి వచ్చాడు. అంతేకాదు తాను 24 గంటల పాటు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. అంతేకాదు సమాజ్ వాదీ తరపున పనిచేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంజయ్ సేథ్ ఎర్ర టోపీ ధరించి  ఈ సమావేశానికి వచ్చారుర.ఈ మీడియా సమావేశాన్ని సేథ్  దగ్గరుండి ఆర్గనైజ్ చేశారు. 

రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన బ్లూ ప్రింట్  తయారు చేయడంలో సేథ్ కీలక పాత్ర పోషించారని   చెబుతుంటారు.  సేథ్  అఖిలేష్ యాదవ్ తో పాటు మాయావతికి కూడ అత్యంత సన్నిహితుడుగా పేరుంది.

click me!