మంటలార్పడం వృత్తి...బోర్ కొట్టిందని, ఇళ్లు తగులబెట్టాడట

By sivanagaprasad kodatiFirst Published Jan 13, 2019, 1:10 PM IST
Highlights

ఎప్పుడూ పని చేసేవాడికి.. ఏ పని లేకపోతే బోర్ కొడుతుంది. దాంతో అతడికి పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో ఏం చేస్తాడో కూడా తెలియదు. అలా వెర్రెక్కిన ఓ యువకుడు తన చుట్టుపక్కల ఉన్న ఇళ్లకి నిప్పుపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 19 ఏళ్ల ర్యాన్ లుభం అనే కుర్రాడు వాలంటీర్ ఫైర్‌ఫైటర్. 

తన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వడంతో పాటు అవసరమైతే వారితో కలిసి రంగంలోకి దిగి మంటలు అదుపు చేయడం అతని పని. కాగా, గత డిసెంబర్ 3, 10 తేదీల్లో ముంబైలోని ఆగ్నేయ పిట్స్‌బర్గ్‌లో వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఇళ్లకు మంటలు ఎలా వ్యాపించాయో తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించిన అధికారులకు ఆ దృశ్యాల్లో ప్రమాదానికి ముందు సదరు ఇళ్ల వద్ద ర్యాన్ లుభం తచ్చాడుతూ కనిపించాడు.

అంతేకాకుండా ఇళ్లకు నిప్పింటించి బయటకు వచ్చి.. మళ్లీ తానే పోలీసులకు సమాచారం ఇవ్వడం గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా. నేరాన్ని అంగీకరించిన అతను బోర్ కొట్టడం వల్లే ఆ పని చేసినట్లు చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు.

అయితే ఇలా ఫైర్ వాలంటీర్లే నిప్పు పెట్టడం ఇది కొత్తకాదు. అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాల్లో ఏడాదికి వందమందికి పైగా ఇలాంటి కేసుల్లో అరెస్టవుతున్నారు. ఎందుకిలా చేశారని అడిగితే తనకు బోర్ కొడుతుందని, నిప్పంటించడం తనకు సరదా అని అధికారులకు చెప్పడంతో వారు నోరెళ్లబెట్టారు.
 
click me!