కేసీఆర్ ముందే ఓటమిని అంగీకరించారు: కుంతియా

By rajesh yFirst Published 6, Sep 2018, 5:08 PM IST
Highlights

ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ తన ఓటమిని తానే ఒప్పుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే కేసీఆర్ అర్థాంతరంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ది నియంతృత్వ ధోరణితో ముందస్తుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ: ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ తన ఓటమిని తానే ఒప్పుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే కేసీఆర్ అర్థాంతరంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ది నియంతృత్వ ధోరణితో ముందస్తుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎవరి కోసం మందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబం కోసమా?...తెలంగాణ కోసమా? అని ప్రశ్నించారు.  ముందస్తు ఎన్నికల వల్ల కోడ్ అమలులో ఉంటుందని కొత్త పనులు జరిగేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోపించారు. 

తెలంగాణలో ఎన్నికలయ్యాక సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అప్పుడు మళ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని దీంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు తప్పవని కుంతియా అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Last Updated 9, Sep 2018, 2:10 PM IST