గే సెక్స్ నేరం కాదు.. సుప్రీం సంచలన తీర్పు

By ramya neerukondaFirst Published 6, Sep 2018, 12:05 PM IST
Highlights

సుధీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది, 

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను రద్దు చేయడం ద్వారా ఎల్జిబీటీ( లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ ‌జెండర్)హక్కులను కాపాడాలని పలువురు సుప్రీంకోర్టులో విడివిడిగా దాఖలు చేశారు. కాగా.. వారి పిటిషన్లపై విచారణకు న్యాయస్థానం స్వీకరించింది.

సుధీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది, లెస్బియన్స్, గేలకు సమాన హక్కులు ఉంటాయని తెలిపింది. మనుషుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాలని  తెలిపింది. సెక్షన్ 377 ఏక పక్షంగా ఉందని.. అది కరెక్ట్ కాదని న్యాయస్థానం పేర్కొంది. 

Last Updated 9, Sep 2018, 1:30 PM IST