రెపోరేటును పెంచిన ఆర్బీఐ, లాభాల్లో మార్కెట్లు

First Published Jun 6, 2018, 4:10 PM IST
Highlights

నాలుగేళ్ళలో  తొలిసారిగా రెపోరేటు పెంపు

న్యూఢిల్లీ:  ఆర్బీఐ రెపోరేటుపై కీలక నిర్ణయం వెలువర్చింది. నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా రెపోను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. రెపోరేటు 6 శాతం నుండి  6.25 శాతానికి పెరిగింది.


రివర్స్ రెపో 5.75 శాతం నుండి 6 శాతంగా ఉండనుంది.  రిజర్వ్‌బ్యాంకు బుధవారం నాడు రెపోరేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  రూపాయి క్ఝీణత, ద్రవ్యోల్బణం పెంపు భయాలు, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఆర్‌బీఐ ఎంపీసీ రేటు పెంపుకే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్  నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు ఎంపీసీ మూడు రోజుల క్రితమే ఈ పాలసీ సమావేశాన్ని ప్రారంభించింది.


బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీరేటే రెపో రేటు. ఈ రేటును పెంచాలని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రెపోరేటు ప్రకటించడంతో మార్కెట్లు లాభాల భాటలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లపై 35,111 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 10, 653 వద్ద కొనసాగుతున్నాయి.
 

click me!