కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్: సిద్దును ఓడించిన జీటీదేవేగౌడకు మంత్రి పదవి

First Published Jun 6, 2018, 3:00 PM IST
Highlights

జెడిఎస్‌కు 7, కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. గత నెల 23 వ తేదిన ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా   పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు.  బుధవారం నాడు 23 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.

సోదరుడు రేవణ్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ కు కూడ మంత్రి పదవి దక్కింది. కాంగ్రెస్, జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటైంది.అయితే మంత్రివర్గం కూర్పులో రెండు పార్టీల మధ్య ఎట్టకేలకు 
ఓ  అంగీకారానికి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి 14 మంత్రి పదవులు దక్కాయి. జెడి(ఎస్)కు 7 మంత్రి పదవులు దక్కాయి. బీఎస్పీ,కేజేపీ కి ఒక్కొక్క మంత్రి పదవి దక్కింది.

కాంగ్రెస్ పార్టీకి హోం, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, మెడికల్, భూగర్భజలవనరుల శాఖ, సోషల్ వేల్పేర్ , ఆహారం, సివిల్ సప్లయిస్ , అసెంబ్లీ వ్యవహరాల శాఖ, రవాణ, మైనింగ్ శాఖలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం కుదిరింది.

జెడిఎస్ కు ఫైనాన్స్, ఎక్సైజ్,సమాచారం, ఇంటలిజెన్స్, సాధారణ పరిపాలనా శాఖలు దక్కనున్నాయి.విద్యుత్, పిడబ్ల్యుడీ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పరిశ్రమలు, మైనర్ ఇరిగేషన్ శాఖలు జెడిఎస్ కు దక్కనున్నాయి.


మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు స్థానాల్లో  పోటీ చేశారు. అయితే చాముండేశ్వరీ స్థానంలో జెడి(ఎస్) అభ్యర్ధి జెటి దేవేగౌడ చేతిలో  సిద్దరామయ్య ఓటమిపాలయ్యారు. సిద్దరామయ్యను ఓడించిన జెడి డేవేగౌడకు కూడ కుమారస్వామి మంత్రివర్గంలో చోటు దక్కింది.

 
 

click me!