చూపు లేని వారు డబ్బు లెక్కించడం కోసం.. ఆర్బీఐ పరిష్కారం

By sivanagaprasad kodatiFirst Published Dec 30, 2018, 5:10 PM IST
Highlights

కళ్లున్న వారు సైతం నోట్లను లెక్కించడంలో ఒక్కోసారి పొరబడతారు.. మరి అలాంటిది చూపు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి వారి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరిష్కార మార్గాన్ని కనుగొంది.

మొబైల్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ద్వారా చూపులేని వారు సైతం సులువుగా నగదు లావాదేవీలను నిర్వహించవచ్చు. ఒక డివైజ్ చూపులేని వారి కోసం అందుబాటులోకి రానుంది. దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన ఈ డివైజ్‌కు దగ్గరగా నోట్లను తీసుకెళ్లినప్పడు ఈ పరికరం దాని విలువను ఇంగ్లీష్ లేదా హిందీలో చెబుతుంది.

మొబైల్ ఫోన్‌లో కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా నోటు విలువను గుర్తించవచ్చు. ఇందుకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అక్కర్లేదు. దుకాణదారులకు అందించే డివైజ్.. బ్యాటరీ ఆధారంగా పనిచేస్తోంది..

దీనిని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఆర్బీఐ ప్రస్తుతం రూ.100 అంతకన్నా ఎక్కువ విలువైన నోట్లపై గుర్తింపు చిహ్నాలను ముద్రిస్తోంది. ఆ గుర్తుల ద్వారా దృష్టిలోపంతో ఉన్న వారు సులభంగా నోట్ల విలువును గుర్తించవచ్చు.
 
click me!