ట్రిపుల్ తలాక్ బిల్లు: అడ్డుకుంటానన్న కాంగ్రెస్, ఎంపీలకు బీజేపీ విప్

By sivanagaprasad kodatiFirst Published Dec 30, 2018, 2:25 PM IST
Highlights

తన పార్టీ రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. సోమవారం నాడు జరిగే రాజ్యసభ సమావేశంలో ప్రతిష్టాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రానుండటంతో దీనికి పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. 

తన పార్టీ రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. సోమవారం నాడు జరిగే రాజ్యసభ సమావేశంలో ప్రతిష్టాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రానుండటంతో దీనికి పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. ట్రిపుల్ తలాక్ బిల్లు గురువారం నాడు విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది..

బిల్లుకు అనుకూలంగా ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. మరోవైపు ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.

తక్షణ తలాక్‌ను నేరంగా పరిగణిస్తున్న ప్రస్తుత బిల్లును యథాతథంగా ఆమోదించే ప్రసక్తి లేదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకుంటుందని వేణుగోపాల్ తెలిపారు.

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2018ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో 10 విపక్ష పార్టీలు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు మహిళా సాధికారకతకు ఏమాత్రం ఉపయోగపడదని వేణుగోపాల్ పేర్కొన్నారు.

బిల్లులోని కొన్ని ప్రొవిజన్లు రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆరోపించింది. అలాగే పరిశీలన నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది. 

click me!