అన్ని రకాల రుణాలపై మరో మూడు మాసాల పాటు మారటోరియం విధిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మూడు మాసాల పాటు రుణాలపై మారటోరియాన్ని ఆర్బీఐ విధించిన విషయం తెలిసిందే.
ముంబై: అన్ని రకాల రుణాలపై మరో మూడు మాసాల పాటు మారటోరియం విధిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మూడు మాసాల పాటు రుణాలపై మారటోరియాన్ని ఆర్బీఐ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో మారటోరియాన్ని మరో మూడు మాసాల పాటు పొడిగిస్తున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారంనాడు ఉదయం ముంబైలో మీడియాతో మాట్లాడారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా ముందుకు వచ్చారు.
ఈ ఏడాది ఆగష్టు నెలాఖరు వరకు రుణాలపై మారటోరియం కొనసాగుతోందని ఆయన వివరించారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుండి ఆగష్టు 31వరకు మూడు మాసాల పాటు మారటోరియం విధిస్తున్నట్టుగా ఆయన వివరించారు.
also read:మరోసారి వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ: 4.4శాతం నుండి 4 శాతానికి తగ్గింపు
మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది, దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని ఆయన చెప్పారు. 3.7 శాతం ఆహార ఉత్పత్తులు పెరిగాయని ఆయన ప్రకటించారు. మార్చి, ఏప్రిల్ లో సిమెంట్, స్టీల్ పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.
ఏప్రిల్ లో ఆహార ద్రవ్యోల్బనం 8.6 శాతానికి పెరిగిందని ఆర్భీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వ్యవసాయ రంగానికి రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టుగా ఆయన ప్రకటించారు.
ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా క్లిష్టంగా మారిందన్నారు. రుతుపవనాల కదలిక సాధారణంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు.
పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిందన్నారు.