కర్ణిసేన మహిళా అధ్యక్షురాలిగా రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి

By Arun Kumar PFirst Published Oct 20, 2018, 5:01 PM IST
Highlights

క్షత్రియ రాజ్ పూత్ సంఘ  గుజరాత్ మహిళా  విభాగ చీఫ్ గా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా తెలిపారు. 
 

క్షత్రియ రాజ్ పూత్ సంఘ  గుజరాత్ మహిళా  విభాగ చీఫ్ గా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా తెలిపారు. 

తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన కర్ణిసేకు రివా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కర్ణిసేన సౌరాష్ట్ర చీఫ్ జేపీ జడేజా, జామ్‌నగర్ పట్టణ విభాగం చీఫ్ రితాబా జడేజాల వల్లే తాను మహిళా విభాగం చీఫ్‌గా నియమితమయ్యానని అన్నారు. అందువల్ల వారికి ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు రివా. 

గతేడాది ‘పద్మావత్’ సినిమాకి వ్యతిరేకంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. క్షత్రియ వంశ చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిచినట్లు పేర్కొంటూ వారు ఈ నిరసన చేపట్టారు. దీంతో కొన్ని రాష్ట్రాలు మొదట్లో ఈ సినిమాను ప్రదర్శించడానికి వెనుకాడాయి. ఈ నిరసనల సమయంలోనే కర్ణిసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

క్షత్రియ, రాజ్ పూత్ ల గురించి కర్ణిసేన ఎంతగానో పోరాడుతోందని రివా ప్రశంసించారు. కేవలం వీరి పక్షానే కాకుండా సమాజంలో దోపిడికి గురైన అన్ని వర్గాల కోసం  పోరాడుతొందన్నారు. వీటికి తోడుగా మహిళా హక్కుల కోసం కర్ణిసేన తరపున పోరాడటానికి తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంస్థ కోసం పనిచేయడం గర్వంగా ఉందని రివా తెలిపారు.  
 

click me!