ఆరుగురు సుప్రీం జడ్జిలకు స్వైన్ ఫ్లూ

By narsimha lodeFirst Published Feb 25, 2020, 6:12 PM IST
Highlights

సుప్రీంకోర్టుపై స్వైన్ ఫ్లూ ప్రభావం కన్పించింది. ఆరుగురు జడ్జిలు స్వైన్ ఫ్లూ వ్యాధికి గురయ్యారు.

కోర్టులో పనిచేసేవారికి స్వైన్ ఫ్లూ  వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరినట్టుగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.ఈ విషయమై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తో చీఫ్ జస్టిస్ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. స్వైన్ ఫ్లూ నివారణ విషయమై ఈ సమావేశంలో చర్చించారు.

 శబరిమల లాంటి కేసుల హియరింగ్స్ పై స్వైన్ ఫ్లూ ప్రభావం చూపుతోంది.జస్టిస్ ఎఎస్ బొపన్న,  హేమంత్ గుప్తా, ఇందిరా బెనర్జీ, ఎల్ నాగేశ్వరరావు, హృషికేష్  రాయ్, అబ్దుల్ నజీర్  మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు హాజరు కాలేదు.

 ఢిల్లీలో 152 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ రిపోర్టులు ఉన్నాయి. గత నెలలో 880చ మందిని పరీక్షిస్తే 152 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా  తేలింది.దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో 172 , ఇక ఢిల్లీ నిలిచింది. ఆ తర్వాత కర్ణాటకలో 151 మందికి, తెలంగాణలో 148 మందికి స్వైన్ ఫ్లూ  కేసులు నమోదైనట్టుగా  రికార్డులు చెబుతున్నాయి.

click me!