ఆ ఊర్లో ఐదు రోజులపాటు ఆడాళ్లంతా బట్టలు వేసుకోకుండా ఉంటారట.. మన దేశంలోనే ఎక్కడో తెలుసా?

Published : Jun 18, 2023, 06:46 PM IST
ఆ ఊర్లో ఐదు రోజులపాటు ఆడాళ్లంతా బట్టలు వేసుకోకుండా ఉంటారట.. మన దేశంలోనే ఎక్కడో తెలుసా?

సారాంశం

హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మహిళలు  ఏడాదిలో ఐదు రోజులపాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉండే ఆచారం ఒకటి అమలవుతున్నది. ఐదు  రోజులపాటు నగ్నంగా ఇంటిలోనే వారు ఉంటారు. భర్త కూడా వారితో ఆ సమయంలో మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయి.  

ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు ఉంటాయి. ఆమోదనీయమైన ఆచారాలు ప్రబలంగా ఉండగా.. జనబాహుళ్యం ఆమోదించనివి కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోతాయి. ఇలాంటి ఆచారాలు విచిత్రంగా, నమ్మశక్యంకానివిగా కూడా ఉంటాయి. అలాంటి కోవలోకే ఇప్పుడు మనం చర్చించబోతున్న ఆచారం వస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు నూలు పోగు కూడా ధరించరు. వినడానికి ఎబ్బెట్టుగా ఉన్న ఈ ఆచారాన్ని వాళ్లు తప్పకుండా పాటిస్తున్నారు. దీన్ని పాటించడానికి వారికి ఒక కారణం ఉన్నది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామంలో ఈ ఆచారం అమలవుతున్నది. శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నది. ఈ గ్రామ మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు ధరించరు. ఆ సమయంలో పిని గ్రామానికి బయటి నుంచి ఎవరైనా రావడం నిషిద్ధం. 

బట్టలు వేసుకోని ఆ ఐదు రోజుల్లో మహిళలు ఇంటి గడప దాటరు. ఎంతో నిష్టతో ఈ ఆచారాన్ని వారు పాటిస్తారు. ఆ కాల అవధిలో కేవలం స్త్రీలే కాదు.. పురుషులు కూడా కొన్ని నిబంధనలను అనుసరిస్తారు. మద్యం తాగరాదు, మాంసాహారం తినరాదు. ఆ ఐదు రోజులు ఆలుమగలు మాట్లాడుకోవడమూ నిషేధమే.

Also Read: బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెక్?.. కాంగ్రెస్‌లో ఒక్కటవుతున్న ఆ సామాజిక వర్గం.. హస్తం విజయానికి కీలక అడుగులు!

ఏ ఆచారమైనా దాని పుట్టుకకు, పాటించాల్సిన ఆవశ్యకతను చెప్పడానికి కొన్ని కథనాలు ప్రచారంలో ఉంటాయి. ఈ ఆచారానికి కూడా అలాంటి ఓ కథే ఉన్నది. ఈ ఆచారం పాటించకుంటే మహిళలకు కీడు జరుగుతుందని నమ్ముతారు. శతాబ్దాల క్రితం ఆ గ్రామాన్ని రాక్షసుల మూక ఆక్రమించిందని, వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు తొడిగి ఎత్తుకెళ్లేవారని ఆ గ్రామస్తులు చెప్పుకుంటారు. అప్పుడు ఓ దేవత ప్రత్యక్షమై మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వచ్చి ఎత్తుకెళ్లుతారనే భయంలో నుంచి ఈ ఆచారం పుట్టినట్టు కథలున్నాయి. అందుకోసమే మహిళలు ఐదు రోజులపాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారని ఆ గ్రామ పెద్దలు వివరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్