
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు ఇతర కోవిడ్ -19 కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళనకు ఎక్కువవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు 1500 దాటాయి.
గాల్వన్ లోయలో జెండా ఎగరేసిన చైనా.. కేంద్రంపై విపక్షాల విమర్శలు.. ఆర్మీ వర్గాలు ఏమన్నాయంటే?
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ఇప్పటి వరకు 90 శాతం మంది జనాభాకు మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపింది. ఇప్పటి వరకు మొదటి డోసు భారత జనాభాలో అర్హులైన 90 శాతం మందికి మొదటి డోసు అందజేశామని తెలిపింది. అలాగే అర్హులైన వారిలో 65 శాతం మందికి రెండో డోసు కూడా అందిందని పేర్కొంది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని చెప్పింది. చాలా దేశాల కంటే భారత్ వ్యాక్సినేషన్‌లో ముందుందని తెలిపారు. మొదటి డోసు, రెండో డోసుల విషయంలో భారత్ చాలా ముందంజలో ఉందని స్ఫష్టం చేసింది.
నేటి నుంచి 15-18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్
కరోనా వ్యాప్తి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి వ్యాక్సినేషన్ ఒక ముఖ్యమైన అంశమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ, హైబ్రీడ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీని వల్ల కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక వేళ కరోనా సోకినా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానంగా దృష్టి సారించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వేగంగా ఈ ప్రక్రియ చేపడుతోంది.
భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య.. రెండు శవాలు !
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే స్కూల్స్, కాలేజీలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే పిల్లలు తిరిగి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే మళ్లీ ఈ ఒమిక్రాన్ వార్తలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఇంత వరకు 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందజేశారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ మొదలవడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. 15-18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. అలాగే కరోనా వారియర్స్, ఆరోగ్య సిబ్బందికి మరో అదనపు డోసు ఇస్తామని తెలిపింది. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ల విషయంలో జనవరి ఒకటో తేదీన నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. నేటి నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు. తెలంగాణలో డైరెక్ట్ గా విద్యా సంస్థలకే వచ్చి వ్యాక్సిన్ వేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పిల్లలకు భారత్ బయోటెక్.. ఐసీఎంఆర్, ఫూణే వైరాలజీలు కలిసి సంయుక్తంగా రూపొందించిన కోవాగ్జిన్ టీకా ఇవ్వనున్నారు. రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉండాలని నిర్ణయించారు.