మధ్యప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య...

Published : Jul 10, 2023, 08:19 AM IST
మధ్యప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య...

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని విదిషాలో అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.   

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని విదిషాలో అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య కలకలం రేపింది. రెండు నెలల క్రితం ఓ అమ్మాయిపై ఆరుగురు సామూహిక వేధింపులకు పాల్పడగా.. ఆమెమృతి చెందింది. రెండు నెలల తరువాత ఆమె తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూతురు మీద అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరు జైలునుంచి విడుదలవ్వడంతో.. మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 

దీనిమీద రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా శనివారం విచారణకు ఆదేశించారు. ఆరుగురు వ్యక్తులు తనమీద లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించిన.. బాధిత బాలిక మే 25న మరణించింది. ఆమె వాంగ్మూలం ప్రకారం నటేరన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని సుదీప్ ధాకడ్‌గా గుర్తించామని, అరెస్టు చేశామని విదిషా కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అశుతోష్ సింగ్ తెలిపారు.

బకాయి డబ్బులు అడిగినందుకు ఇద్దరు కూలీల దారుణ హత్య..

గురువారం, ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విదిషా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆరుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

బాలిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినప్పుడు, వీరిమీద భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా బలవంతం చేయడం, ఆమె నిరాడంబరతకు భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసి సమన్లు ​​జారీ చేసినట్లు హోం మంత్రి మిశ్రా తెలిపారు.

ఆ తర్వాత బాలిక చనిపోయినప్పుడు ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసి, సుదీప్ ధాకడ్‌ను అరెస్టు చేసినట్లు మిశ్రా తెలిపారు. ఇటీవల నిందితుడు జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత బాలిక తండ్రి తన జీవితాన్ని ముగించుకున్నాడని తెలిపారు.

“డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ ఈ సంఘటనపై విచారణ చేసి మూడు రోజుల్లో నివేదికను సమర్పిస్తారు. ఈ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. తండ్రి మృతికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, నటేరన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్, హెడ్ కానిస్టేబుల్‌ను ఫీల్డ్ డ్యూటీ నుండి తొలగించినట్లు మంత్రి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu